బట్టలు. ఇవి నాగరికతకూ, సంప్రదాయానికీ గుర్తు. దేశాన్ని, ప్రాంతాన్ని, సందర్భాన్ని బట్టి ఈ వేష ధారణలో మార్పులు వస్తాయి. ఇంత వరకూ బట్టలంటే మనం వాడిన తరువాత చిరిగిపోయేవి, బయట పడేసేవి, అంతే తప్ప వీటిలో ఏ ప్రత్యేకతా లేదు. ఈ బట్టల్లో ఉపయోగించిన fabric, తయారు చేసే పద్ధతిని బట్టి దీని ధర నిర్ణయింపబడుతుంది. ఇంత వరకూ బట్టల్లో ఖరీదైనవి, ఖరీదు కానివి ఉన్నాయి. కానీ సాంకేతికత పుణ్యమా అని ఇప్పుడు బట్టలను వాటి తెలివిని బట్టి ఖరీదు చేయాలేమో. అర్ధం కావట్లేదా, అదేనండీ నేను చెప్పేది “smart clothes” గురించి. సాంకేతికత కేవలం స్మార్ట్ ఫోన్, స్మార్ట్ హోం దగ్గరే ఆగిపోలేదు. మరో అడుగు ముందుకేసి smart clothes గా మన ముందుకొచ్చింది. ప్రస్తుతానికి వింతగా అనిపించినా భవిష్యత్తులో సర్వ సాధారణం కాబోయే smart clothes ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం.

అమెరికా లో Behnaz Farahi అనే ఒక డిజైనర్ ఆడ వారి కోసం ఒక కొత్త t-shirt ను రూపొందించింది. దీనికి ఆవిడ Caress of the Gaze, అని పేరు పెట్టుకుంది. ఇది అలాంటి ఇలాంటి t-shirt కాదు. దీనికి చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. దీనిలో ఒక hidden కెమెరా ఉంది. దీనిలోని face-tracking algorithm ద్వారా ఈ t-shirt వంక చూసే వారు ఆడ/మగ, వారి వయసు, వారు ఎటు వైపు చూస్తున్నారన్నది కనిపెట్టేస్తుంది. అయితే ఏంటి అనుకుంటున్నారా. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. చూపరులు చూస్తున్న దిశగా ఈ బట్ట ఒంటికి చుట్టుకుంటుంది. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా. 3D ప్రింటెడ్ మెటీరియల్ మరియు సంకోచం, వ్యాకోచం కాగల fibers తో ఈ t-shirt ను తయారు చేసారు.

అందువల్ల బావుంది కదా అని చూడటం మొదలు పెడితే ఇది రెడ్ హ్యాండెడ్ గా పట్టించేస్తుంది. ఇంకా నయం ప్రస్తుతానికి అక్కడి తో ఆగారు. ఎవరు చూస్తున్నారో కూడా చూపించేసే బట్టలు వస్తాయేమో చూడాలి. తస్మాత్ జాగ్రత్త. ఇక పై ఏ బట్టలో ఎలాంటి కెమెరా ఉండబోతోందో. ప్రస్తుతానికి దీన్ని మార్కెట్ లోకి విడుదల చేయడం లేదని ఈ డిజైనర్ ప్రకటించింది.

Courtesy