భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారులకు బంపర్ ఆఫర్ ను అందిస్తోంది. తన ఫ్రాంచైజీలకు ఉచితం గా ఎయిర్ ఫైబర్ కనెక్ష అందిస్తోంది.

ఇలా అందించే సర్వీస్ ను రేడియో బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ (RBSP) అని పిలుస్తారు.

ఈ సర్వీస్ ని అర్హత కలిగిన ఫ్రాంచైజీలకు ఉచితంగా ఇస్తోంది. దాంతో పాటు ప్రభుత్వ టెల్కో 40 Mbps ప్లాన్‌ను కూడా ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది.

అయితే బీఎస్ఎన్ఎల్ ఉచితంగా ఇచ్చిన ఫ్రాంచైజీ కంపెనీల నుంచి కనెక్షన్ పొందలేరు, బీఎస్ఎన్ఎల్ నుంచి ఈ ఆఫర్‌కు అర్హత పొందడానికి భారత్ ఎయిర్ ఫైబర్ ఫ్రాంచైజీలు కనీసం 50 FTTH కనెక్షన్‌లను అందించాలి.

బీఎస్ఎన్ఎల్ (BSNL) నుంచి ఇప్పటి వరకు 50 కంటే ఎక్కువ FTTH కనెక్షన్‌లను అందించిన ఫ్రాంచైజీ ఉంటే కనుక వారు ఈ ఆఫర్‌కు నేరుగా అర్హత పొందుతారు.

దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఈ ఆఫ‌ర్ ప్రకారం ముందుగా బీఎస్ఎన్ఎల్ ఎయిర్‌ఫైబర్ బేసిక్ ప్లస్ ప్లాన్‌తో భారత్ ఎయిర్ ఫైబర్ కనెక్షన్‌, ఉచిత డెమో అందుతోంది. దీని స్పీడ్ సుమారు 40 Mbps ఉంటుంది. రూ.699ల‌తో క‌నీసం 50 బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లను ఎయిర్ ఫైబ‌ర్ భాగ‌స్వామికి చెంద‌న ప్రతి ఆఫిస్ కి అందిస్తోంది.

ఈ డెమో కనెక్షన్‌ను బీఎస్ఎన్ఎల్ ఫ్రాంఛైజీలు మాత్రమే వినియోగించుకోవాలి. ఇత‌రులు వినియోగించడానికి వీలు లేదు.

ఫ్రాంఛైజీలు డెమో కనెక్షన్‌ను ఎవరికీ విక్రయించడానికి అనుమతి లేదు. డెమో కనెక్షన్ (Demo Connection) కోసం బీఎస్ఎన్ఎల్ ఎటువంటి బిల్లులను జారీ చేయదు.

అసలు ఎయిర్ ఫైబర్ కనెక్షన్ అంటే ఏమిటి?

తక్కువ జనాభా మరియు వెనుక బడిన గ్రామీణ ప్రాంతాల్లో ఫైబర్ కనెక్షన్లు మరియు టెరెస్ట్రియల్ నెట్‌వర్క్ అందించబడవు.

అటువంటి ప్రాంతాల్లో నివసించే ప్రజలకు, వారి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ప్రాథమిక డిజిటల్ టూల్లను యాక్సెస్ చేయలేరు.

అటువంటి ప్రాంతాలు మరియు భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల మధ్య డిజిటల్ సమస్యని తగ్గించడానికి BSNL భారత్ ఎయిర్ ఫైబర్ సర్వీసును వెల్లడించింది.

ఈ సర్వీస్ కింద బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ అందించడానికి లైసెన్స్ లేని Wi-Fi స్పెక్ట్రంను వినియోగించుకుంటుంది.

ఇది పూర్తిగా వైర్‌లెస్ కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వినియోగదారులు స్థిరమైన ఇంటర్నెట్ సర్వీసులను కూడా పొందవచ్చు.

కంపెనీ నెలకు రూ.499 ధర వద్ద భారత్ ఎయిర్ ఫైబర్ సేవలను అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ తన గ్రామీణ టవర్లు ఉన్న చోట కూడా ఈ సర్వీసును అందిస్తుంది కానీ FTTH ఉనికి లేదు.