చిప్(CHIP). ఎలక్ట్రానిక్ పరికరాల్లో వుండే ముఖ్యమైన వస్తువు. ఈ చిప్ ల మీద వుండే సూక్ష్మమైన సర్క్యూట్ల ద్వారా ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు పని చేస్తుంటాయి. ఇంతటి ముఖ్యమైన చిప్ ల మీద ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ చిప్ల మీద ఎంతటి సూక్ష్మమైన సర్క్యూట్ లను అమర్చితే వీటి సామర్ధ్యం అంత పెరుగుతుంది అన్న మాట. ఇంతటి ప్రాధాన్యత కలిగిన చిప్ ల తయారీలో ఒక విప్లవాత్మకమైన పద్ధతిని కనుగొన్నారు అమెరికా కు చెందినా విస్కాన్సిన్-మాడిసన్ (Wisconsin-Madison) యూనివర్సిటీ కి చెందిన శాస్త్రవేత్తలు. అదే ఈ గ్రీన్ చిప్. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం.

సాధారణంగా ఎలక్ట్రానిక్ వస్తువుల్లో చిప్ అంటే ఒక చిన్న పలక (plate) వంటిది. దీని మీద సర్క్యూట్ లను అమర్చుతారు. ఈ పలకను సెమీకండక్టర్ మెటీరియల్ తో తయారు చేస్తారు. ఈ పదార్ధాల వల్ల పర్యావరణానికి హాని జరుగుతుంది. పైగా ఈ చిప్ ల మీద చాలా భాగం వృధా అవుతోంది.  ఈ సమస్యకు సమాధానమే ఈ గ్రీన్ చిప్. ఈ గ్రీన్ చిప్ మీద వుండే పొరను పూర్తిగా చెక్క నుంచి వచ్చే Cellulose Nanofil (CNF) అనే పదార్ధం తో తయారు చేస్తారు. అందువల్ల ఇది పర్యావరణానికి ఎటువంటి హాని చేయదు. దీని మీద వుండే స్పేస్ వృధా కాకుండా సంప్రదాయ చిప్ ల కంటే ఎక్కువ ట్రాన్సిస్టర్ లను దీని మీద అమర్చవచ్చు. దాని వల్ల దీని సామర్ధ్యం సాధారణ చిప్ ల కంటే మరింత ఎక్కువ. అన్నిటికీ మించి, ఈ గ్రీన్ చిప్ ను చాలా చౌకగా తయారు చేయవచ్చు. అయితే ఈ గ్రీన్ చిప్ కు కొన్నిపరిమితులు వున్నాయి. ఇది సెల్యులోస్ (cellulose) తో తయారు అవడం వల్ల ఇది అధిక ఉష్ణోగ్రత లకు కరిగిపోవచ్చు. అందుకే దీనికి మరింత మెరుగులు దిద్ది తొందరలోనే మార్కెట్లోకి విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Chip_1

నిపుణుల అంచనా ప్రకారం ఈ గ్రీన్ చిప్ ఎలక్ట్రానిక్ రంగంలో ఒక సరి కొత్త అంకానికి నాంది పలకబోతోంది. ఇటువంటి పరిశోధనల ఫలితంగా భవిష్యత్తులో చుట్టుకొనే సెల్ ఫోన్, మడత పెట్టి దాచుకొనే టీ.వీ లు వస్తాయేమో వేచి చూద్దాం.

Courtesy