ఏపీ(AP)లో ఏప్రిల్ 3వ(April 3rd) తేదీ నుంచి 18వ తేదీ వరకు టెన్త్ ఎగ్జామ్స్ ను (AP Tenth Exams) నిర్వహించనున్నట్లు ఇప్పటికే అధికారులు షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) హాల్ టికెట్లను విడుదల చేసింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్ల(Hall Tickets)ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తం(State wide)గా 3,350 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు రాష్ట్రంలో 6,10,000 మంది రెగ్యులర్, 55వేల మంది ప్రైవేటు విద్యార్థులు హాజరుకానున్నట్లు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ స్టెప్స్ తో హాల్ టికెట్ల డౌన్ లోడ్:

  • మొదట అధికారిక వెబ్ సైట్(Official Website) bse.ap.gov.in ఓపెన్ చేయాలి.
  • హోం పేజీ(Home Page)లో SSC Public Examinations 2023 – HALL TICKETS లింక్ పై క్లిక్ చేయాలి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అనంతరం రెగ్యులర్ హాల్ టికెట్స్ డౌన్ లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • అనంతరం జిల్లా(District), స్కూల్ సెలక్ట్(Select School) చేయాలి. అనంతరం పేర్ల లిస్ట్(Names List) కనిపిస్తుంది. పేరు సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం డేట్ ఆఫ్ బర్త్(Date of Birth) నమోద చేయాలి.
  • తర్వాత Download Hall ticket ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

మీ హాల్ టికెట్ హోం స్క్రీన్(Home Screen) పై కనిపిస్తుంది. ప్రింట్(Print) తీసుకుని భద్రపరుచుకోవాలి.