శత్రువును ఓడించాలంటే దాడి చేయాలి లేదా స్వశక్తి తో శత్రువు భయపడి పారిపోవాలి. అనారోగ్య సమస్యలను నయంచేయడంలో వైద్య రంగం ఇప్పటివరకు మొదటి పద్ధతినే అనుసరిస్తూ వచ్చింది. కానీ రెండో పద్ధతిలో అంతర్గతంగా మిత్ర బాక్టీరియాను బలోపేతం చేయడం ద్వారా వ్యాధుల మీద విజయం సాధించవచ్చునని పరిశోధనలు నిరూపిస్తున్నాయి .

అలాంటి మిత్ర బాక్టీరియా ను పెంచేవే ప్రోబయోటిక్స్ అసలు ఈ ప్రోబైయటిక్ అంటే ఏంటి? అది ఎలా పని చేస్తాయి? ఇక్కడ తెలుసుకుందాం.

బాక్టీరియా (Bacteria) రెండు రకాలు గా ఉంటుంది. ఒకటి చెడు బాక్టీరియా, మరొకటి మంచి బాక్టీరియా.

మొదటిది శరీరానికి హానికలిగించేది. రెండవది అంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

శరీరంలో సజీవంగా వుండే జీవక్రియల్లో ఉపయోగపడుతుంది. సాధారణంగా ఈస్ట్ (yeast) అనే బాక్టీరియా శరీరానికి మంచి చేసే బాక్టీరియా, ప్రేగుల్లో జీర్ణక్రియ ప్రక్రియల్లో పాల్గొంటాయి. శరీరానికి వ్యాధులు కలిగించే క్రిములను చంపేస్తాయి. కొన్ని రకాల విటమిన్ల తయారీలోను ఈ ప్రోబైయటిక్స్ సహకరిస్తాయి.

పాల ఉత్పత్తిలో వుండే ఈ బాక్టీరియా వల్ల జీవక్రియ మెరుగుపడుతుందని, పరిశోధనల ద్వారా స్పష్టం చేసారు. చాలా మంది పెరుగు, మజ్జిగలో మాత్రమే శరీరానికి మంచి చేసే బాక్టీరియా ఉంటుందని నమ్ముతారు, కానీ బంగాళాదుంపలు (Potato), అరటిపండ్లు (Bananas), తాజా కూరగాయలు (Fresh Vegetables), చీజ్ (Cheese) లాల్లోను మంచి చేసే బాక్టీరియా ఉంటాయి.

ప్రోబైయటిక్స్ జీర్ణక్రియను వృద్ధి చేయడమే కాకుండా ప్రేగులను శుభ్రపరచడంలో ఉపాయపగపడతాయి. అంతే కాదు వాటి ద్వారా డయేరియా, విరేచనాల సమస్యకు చెక్ పెట్టవచ్చని పలు పరిశోధనల్లో వెల్లడైంది.

క్రాన్స్ వ్యాధి, అల్సర్ లాంటి సమస్యలను కూడా ప్రోబైయటిక్స్ నివారిస్తాయి. సాధారణంగా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ (Bacterial Infections) వచ్చినపుడు యాంటీ బయోటిక్స్ (Anti- Biotics) వాడుతుంటాం.

వైద్యుల సూచనా మేరకు యాంటీ బయోటిక్స్ వాడినప్పటికీ, శరీరంలో చెడు బాక్టీరియా తో పాటు మంచి బాక్టీరియా కూడా నశిస్తుంటుంది.

కాబట్టి ఈ మంచి బాక్టీరియా ని శరీరంలో పొందుపరచాలి. ఇందుకోసం ప్రోబైయటిక్స్ ఉపయోగిస్తారు. ఈ ప్రోబైయటిక్స్ కేవలం ఆహార పదార్దాల ద్వారా మాత్రమే కాదు, సప్లీమెంట్ల రూపంలోనూ మనకు లభిస్తాయి. వాటిని వ్యాధుల సూచనా మేరకు వాడుకోవచ్చు.

తీపి, చెక్కర ఎక్కువగా వుండే పదార్దాలు, బాగా సుద్ధి చేసిన రిఫైన్డ్ (Refined)పదార్దాలు ఎక్కువగా తినకూడదు. ఇవి ప్రేగుల్లో పులిసినట్లై చెడ్డ బాక్టీరియా పెరిగిపోయేందుకు దోహదం చేస్తాయి.

స్వీట్లు, కుకీస్, చిప్స్, పేస్ట్రీస్, (Sweets, Cookies,Chips,Pastry) ప్యాకెట్లో దొరికే పదార్దాలు తగ్గించడం మంచిది. ఆహారం బాగా నమిలి తినాలి. మద్యం ప్రేగుల్లోని మంచి బాక్టీరియా ను దెబ్బ తీయటం తో పాటు చెడ్డ బాక్టీరియా ప్రభావం పెరిగేలా చేస్తుంది. కాబట్టి తరచూ మద్యం తాగకుండా ఉండడం మంచిది.

ప్రోబైయటిక్స్ అనేవి సజీవంగా వుండే బాక్టీరియా అందుకే వీటిని భద్రపరచడంలో జాగ్రత్తలు తీసుకోవాలి . సప్లిమెంట్ రూపంలో వుండే వాటిని రెఫ్రిజిరేటర్ లో భద్రపరచాలి. లేబల్ పై వున్న గడువు లోగా వాటిని తీసుకునే ప్రయత్నం చేయాలి.

శరీరంలో వృది చెందే మంచి బాక్టీరియా కు మనం ఇచ్చే ఆహార పదార్దాలే ఆహారం గా ఉపయోగపడతాయి. ముఖ్యం గా ఆహారంలోని పిండిపదార్దాలను ఇవి ఆహారం గా తీసుకుంటాయి తృణ ధాన్యాలు, అరటిపండ్లు, ఉల్లిగడ్డలు (Onions) లాంటివి ప్రోబైయటిక్స్ కు ఆహారంగా ఉపయోగపడతాయి. ప్రోబైయటిక్స్ తీసుకోవడం వల్ల మంచి బాక్టీరియా వృదిచెందుతుంది.

శారీరక ఆరోగ్యానికి ఇది మంచి చేస్తుంది. కాబట్టి ప్రోబైయటిక్స్ లభించే ఆహారాలు తీసుకోవాలి.

ముఖ్యం గా ప్రోబైయటిక్స్ లభించే పెరుగు, మజ్జిగ, అరటిపండు తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయాలి. .