స్వచ్ఛ భారత్ తెలుసు కానీ ఈ స్వచ్ఛ మొబైల్ ఏంటి అనుకుంటున్నారా. ఆ అవసరం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొబైల్ (చరవాణి) మన జీవితంలో ఇంకా చెప్పాలంటే మరి కొన్ని సంవత్సరాల్లో మన శరీరంలో భాగమైపోతుంది అని అన్నా అతిశయోక్తి కాదేమో. మన వ్యక్తిగత శుభ్రతకు ఇచ్చినంత ప్రాముఖ్యత మొబైల్ కు ఇవ్వం. అసలు దాని పట్ల అటువంటి దృష్టి కోణమే మనకు లేదు. అసలు మొబైల్ శుభ్రంగా ఎందుకు వుండాలి అంటే…

తెల్లారి కూరగాయలవాడు ఇచ్చిన చిల్లర దగ్గరనుంచి పానీపురి వాడు అదీ చేత్తో ఇచ్చిన నోటు వరకు అన్నీ జేబులో మొబైల్ పక్కనే పెట్టుకుంటాం. ఇక మొబైల్ ను ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటాం. మరి ఊహించండి అది ఎంత మురికిగా వుండి వుంటుందో, ఇంకా దాని పై ఎంత బాక్టీరియా చేరి వుంటుందో.

PhoneSoap_2

PhoneSoap_1

ఈ మధ్యనే పాశ్చాత్య దేశాల్లో జరిగిన ఒక సర్వే ప్రకారం మన నిత్య జీవనంలో అత్యంత కలుషితం అయిన వస్తువు డెస్క్ టాప్ కీ బోర్డు. రెండవ స్థానంలో మొబైల్ వుంది. మరి దీనిని ఎలా శుభ్రం చేయాలి, తడి తగిలితే ఈ కాలం స్మార్ట్ ఫోన్లు పని చేయవు అని అనుకుంటే ….ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఫోనులను శుభ్రం చేసేందుకు వచ్చింది “ఫోన్ సోప్ ఛార్జర్”.

ఇది ఒక చిన్న పెట్టెలాంటి పరికరం. దీని లోపల అతినీలలోహిత కిరణాలను ప్రసరించే బుల్బు వుంది. దీని ద్వారా వచ్చే కిరణాలు ఫోను మీది బాక్టీరియాను చంపేస్తాయి. దీనిని ఎలా వాడాలంటే దీని పెట్టెలో ఫోను కు మరియు యుయస్బి (USB) పోర్ట్ కు కేబుల్ కనెక్ట్ చేసి ఫోన్ ఛార్జింగ్ అయ్యే విధంగా వుంచి మూత పెట్టాలి. అప్పుడు నీలం రంగు లైటు వెలుగుతుంది. అంటే ఇది పని చేస్తోందని గుర్తు. తరువాత అయిదు అంటే అయిదే నిమిషాల్లో పని పూర్తి చేస్తుంది. అంటే మనకు సురక్షితం అయిన బాక్టీరియా ఫ్రీ మొబైల్ మన సొంతమవుతుంది. దీని సామర్ధ్యం ఇంచు మించు 8000 గంటలు. అంటే కొన్ని సంవత్సరాలు నిరంతరంగా పని చేస్తుంది అన్న మాట. ఇది తెలుపు మరియు నలుపు రంగుల్లో లభ్యం అవుతుంది. దీని ధర $60. ఇది త్వరలోనే మన దేశంలో కూడా విడుదల అవ్వాలని ఆశిద్దాం.

PhoneSoap_4 PhoneSoap_5 PhoneSoap_6

courtesy