ఈ విండో ప్లగ్ సాకెట్ ఉపయోగించి మీరు సౌర శక్తిని ఒక మంచి పద్ధతి లో వినియోగించు కోవచ్చు. ఇది ఒక నమూనా ప్రోటోకాల్ మాత్రమే. ఈ ఐడియా ని డిజైన్ చేసింది “క్యుహో సాంగ్” (kyuho song) మరియు “బోఅ ఓహ్” (boa oh). ఈ డిజైన్ ప్రోడక్ట్ మన మార్కెట్ లోకి రావటానికి ఇంకొద్ది టైం పడుతుంది.
2010 లో ఈ విండో సాకెట్ డిజైన్ కి పేటెంట్ తీసుకోవటం జరిగింది, కాని ఈ ఐడియా చాల కూల్ గా వుంది కదూ. ఎందుకంటే ఈ చిన్న పవర్ సాకెట్ ని మీరు ఎక్కడైనా ఎండ వచ్చే (ఇంట్లో, కార్లో, లేదా ప్రయాణించేటప్పుడు బస్సు లో లేదా ట్రైన్ లో కాని ) విండోకి అతికిన్చి ఛార్జ్ చెయ్యొచ్చు. ఇది లైట్ వెయిట్. మీరు పవర్ బ్యాంకు తో పోలిస్తే దీనిని క్యారీ చెయ్యటం చాల తేలిక.
దీనికి సంబందించిన పిక్చర్స్ కింద చూడవచ్చు.