ప్రపంచీకరణ ఫలితంగా ఊళ్ళన్నీనగరాలుగా మారుతున్నాయి. దీని కారణంగా మన జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మన దేశవాళి కిరాణాకొట్టు స్థానంలో సూపర్ మార్కెట్లు వచ్చి చేరాయి. మన దేశ రిటైల్ మార్కెట్ రంగంలోకి, వాల్మార్ట్/మెట్రో  వంటి అంతర్జాతీయ కంపెనీలు సైతం ప్రవేశించి సేవలందిస్తున్నాయి.ఈ నేపధ్యంలో సూపర్ మార్కెట్లో వస్తువులు కొనుగోలు చేయడం మనకు అలవాటుగా మారింది.

ఈ వారంతపు సంస్కృతికి అలవాటుపడ్డ మనం ఆ బిల్లింగ్ కౌంటర్ దగ్గర క్యూలో నించుని వస్తువులు కొనడం మనకి అనుభవమే. ఆ తీసుకోబడ్డ వస్తువులను ఒక్కొక్కటిగా స్కాన్ చేయడం, ఆ తరువాత బిల్లు చెల్లించడం మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ పద్ధతికి స్వస్తి చెబుతోంది అమెరికా లోని ఈసిఆర్ (ECR Software Corporation) అనే సంస్థ.

ఈ సంస్థ ఇప్పుడు సూపర్ మార్కెట్లో RAPTOR (Retail Application Prototype Testing of Operational Robotics) లేన్స్ అనే వినూత్నమైన పద్ధతిని ప్రవేశపెడుతోంది. ఇందులో మనం కొనుగోలు చేసే వస్తువులను ఈ RAPTOR లేన్స్ మీద ఉంచితే చాలు, మనిషి సాయం లేకుండానే, ఆటోమాటిక్ గా అదే స్కాన్ చేసి బిల్లును సైతం చూపిస్తుంది. బిల్లింగ్ కౌంటర్ వద్ద కూర్చున్న వ్యక్తి కేవలం దినిని పర్యవేక్షిస్తే చాలు. ఇంత వేగంగా జరిగే ప్రక్రియలో కొనడానికి వచ్చే ఎంతో మంది సమయం ఆదా అవుతుంది.

Raptor_1

ఈ RAPTOR లేన్స్ విధానాన్ని మరి కొద్ది రోజుల్లో అమెరికాలోని చికాగో ల్యాండ్ ప్రవేశపెట్టభోతోంది. ఇది అమల్లోకి వస్తే క్యాషియర్ పని కేవలం బిల్లింగు కి మరియు వస్తువులను సంచిలలో సర్దడానికి మాత్రమే పరిమితం అవుతుంది. ఇంకొన్ని సంవత్సరాలలో దానికి కూడా మనిషి అవసరం లేని సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందేమో వేచి చూద్దాం. ప్రస్తుతం ఈ ఈసిఆర్ సంస్థ ఈ పద్ధతికి పేటెంట్ హక్కును పొందే ప్రయత్నంలో ఉంది!!

courtesy