ష్నీడర్ ఎలక్ట్రిక్ సంస్థ గురించి చాలా మంది వినే ఉంటారు. ఈ సంస్థను 1836 (183 years ago ) సంవత్సరం లో  ” యూజీన్ స్క్నీడర్-Eugene Schneider” ఫ్రాన్స్ లో  స్థాపించారు . ఈ సంస్థ ముఖ్యంగా శక్తి నిర్వహణ, ఆటోమేషన్ సొల్యూషన్, స్పాంనింగ్  హార్డ్వేర్, సాఫ్ట్ వేర్ మరియు ఇతరత్రా సర్వీసులను అందిస్తుంది.  అంతేకాకుండా విద్యుత్ పరికరాలను మరియు ప్రస్తుతం గృహ విద్యుత్ సంస్థాపన ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఈ సంస్థ యొక్క కంపెనీలు దాదాపు 100 దేశాల్లో ఉన్నాయి.

ఈ సంస్థ ప్రతీ సంవత్సరం లాగానే 2019 లో ‘గో గ్రీన్ సిటీ ఛాలెంజ్ -2019’ ప్రాక్టీకల్ ఛాలెంజ్ టెస్ట్ ను నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశం వారైనా, ఏ ప్రాంతంవారైనా, ఏ మతం వారైనా, కనీసం 18 సంవత్సరాలు వయసు పైబడిన ప్రతిభావంతులైన విద్యార్థులు తమ సామర్ధ్యాన్ని నిరూపించుకోదలిస్తే ఇది ఒక చక్కటి అవకాశం. గెలిచినవారికి ఈ సంస్థ ఉద్యోగ అవకాశం మరియు మీరు ప్రపంచంలో ఎంచుకునే ఏవైనా రెండు సిటీస్ (International trip of two cities) ను చూసే అవకాశాన్ని కల్పిస్తుంది.

అర్హత :

  • డిగ్రీ కోర్స్ (కనీసం 2 వ సంవత్సరం) లేదా మాస్టర్ డిగ్రీ చదువుతూ ఉండాలి.
  • ఇంజినీరింగ్ ,బిజినెస్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, మాథెమాటిక్స్ లేదా ఏదైనా ఇతరత్రా సైన్స్ లో చదువుతూ ఉండాలి.
  • ఇంగ్లీష్ మాట్లాడడంలో బాగా ప్రావీణ్యం ఉండాలి.
  •  ఖచ్చితంగా ఒక జట్టుగా ఈ ఛాలెంజ్ లో  పాల్గొనాలి. జట్టుకి ఇద్దరు చొప్పున ఉండాలి. అందులో కనీసం ఒకరు అమ్మాయి అయి ఉండాలి.
  • జట్టులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకే ప్రాంతానికి చెందిన వారు అయి ఉండాలి.

ఛాలెంజ్ యొక్క ప్రయోజనాలు:

గెలిచిన జట్టుకి ష్నీడర్ ఎలక్ట్రిక్ సంస్థవారు ఉద్యోగాలను ఇస్తారు.

ఇంటర్నేషనల్ ట్రిప్ ను ఏర్పాటు చేస్తారు (ష్నీడర్ ఎలక్ట్రిక్ సంస్థ ఉన్న దేశాల్లో మీరు ఎంచుకునే ఏవైనా  రెండు ప్రాంతాలకి).

గ్లోబల్  ఫైనలిస్ట్స్ : ఫైనల్స్ కి చేరిన టాప్ ఎనిమిది జట్లకి బార్సిలోనా (Barcelona) లో జరిగే ష్నీడర్ ఎలక్ట్రిక్ గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్”  కి ఆహ్వానిస్తారు. అంతేకాకుండా వీరికి ష్నీడర్ ఎలక్ట్రిక్ సంస్థ లో ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం (internship job)ను ఇస్తారు.

రీజినల్ ఫైనలిస్ట్స్ : పార్టిసిపెంట్స్ కి గ్రాండ్ ఫినాలే కొరకు ప్రతిపాదించేందుకు మెంటార్ షిప్ ఇవ్వబడుతుంది.

ఉమెన్ ఎనర్జీ అవార్డు : సెమి ఫైనల్స్ లో  గెలిచిన ఏదైనా ఒక అమ్మాయిల జట్టు టీం కు ఉమెన్ ఎనర్జీ అవార్డు, USD 1000$ మరియు ఫైనల్స్ కి వెళ్లే అవకాశాన్ని పొందుతారు.

సెలక్షన్ పద్ధతి  :

స్టేజి 1 : (Regional semi -finals)

ఆన్ లైన్  సెలక్షన్ లో 70 జట్లను (10 – 15 teams per region) ఎంపిక చేసుకుంటారు.

ఈ ఎంపికలో వీరు క్రింద ఇవ్వబడిన  ప్రమాణాన్ని అనుసరిస్తారు

కొత్తదనం (Innovation), సాధ్యత (feasibility), ప్రదర్శన (presentation), నాణ్యత (quality), స్థిర ప్రభావం (sustainable impact)

స్టేజి 2 : (Mentoring phase)

పోటీలో ఎంపికైన జట్లకు ష్నీడర్ ఎలక్ట్రిక్ సంస్థ నిపుణులు సలహాదారులుగా ఉంటారు.

స్టేజి 3 : (Regional Finals)

ఫైనల్స్ కోసము ఆ సంస్థ తరపున ఉన్న న్యాయనిర్ణేతలు ప్రతి రీజియన్ నుంచి బెస్ట్ ప్రాజెక్ట్ ను ఎంపిక చేస్తారు. ఇది స్పెయిన్ లో  జరుగుతుంది.

స్టేజి 4 :(Grand Finale)

ఎంపిక అయిన అగ్ర జట్లను బార్సిలోనా (Barcelona) లో జరిగే “ష్నీడర్ ఎలక్ట్రిక్ గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ ” కు ఆహ్వానిస్తారు.

ముఖ్యమైన తేదీలు :

అప్లికేషన్ దశ : 2 – 1 – 2019 నుంచి 25 – 5 – 2019

రీజినల్ సెమీ ఫైనల్స్ : 27 – 5 – 2019 నుంచి 14 – 6 – 2019

మెంటరింగ్ ఫైనల్స్  : 19 – 6 – 2019 నుంచి 23 – 8 – 2019

ప్రిపరేషన్ ఫేస్  : 29 – 8 -2019 నుంచి 28 – 9 – 2019

గ్రాండ్  ఫినాలే  : 1 – 10 – 2019 నుంచి 5 – 10 – 2019

నిబంధనలు మరియు షరతులు :
ష్నీడర్ ఎలక్ట్రిక్ సంస్థ వారు ఈ ఛాలెంజ్ ను 4 వర్గాలుగా విభజించారు.

  1. Sustainability & Access to Energy 
  2. Buildings of the Future 
  3. Plants of the Future
  4. Grids of the Future

ఈ ఛాలెంజ్ లో పాల్గొనాలనుకునే వారు పైన ఇచ్చిన 4 వర్గాలలో నుంచి ఒక దానిని ఎంపిక చేసుకోవాలి.

ఎంపిక చేసుకున్న కేటగిరికి సంబంధించి నిజ జీవితంలో ఉన్న ఏదైనా ఒక  సమస్యకు (energy management in the city environment) లైవ్ గా పరిష్కార మార్గాన్ని కనుగొనాలి.

దానికి సంబంధించిన విషయాన్నీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సబ్మిట్ చేయాలి. ( ఖచ్చితంగా 10 slides – దానిలో problem statement, differentiation, operational availability, team profile, etc. ఇవి అన్నీ ఉండాలి)

ఈ  ఛాలెంజ్ కి  అప్లై చేయదలచినవారు 

www.gogreeninthecity.com అనే వెబ్సైటు కి వెళ్లాలి.

‘Participate’  అనే బటన్ ని ప్రెస్ చేసి మీ వివరాలు ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకోండి .

అలాగే మీ టీం మెట్ యొక్క వివరాలను కూడా ఇవ్వాలి.

పోటీకి సంబంధించిన  4 categories లో నుంచి,  మీ జట్టు సభ్యులతో చర్చించిన తరువాత  వాటిలో ఒక దాన్నిసెలెక్ట్ చేసుకోండి.

మీ ప్రాజెక్ట్ అంతా తయారు అయినప్పుడు సబ్మిట్ చేయండి.

—  ALL THE BEST