డయాబెటిక్ రేటినోపతి ఇది చక్కెర వ్యాధిగ్రస్తులకు వచ్చే కంటి జబ్బు. ఇది తీవ్రతరం అయితే కంటి చూపు కూడా కోల్పోతారు. ఈ వ్యాధిని కనిపెట్టడం అంత సులభం కాదు. ఈ వ్యాధి సోకితే ఈ వ్యాధి ముదిరేదాకా ఎలాంటి ప్రత్యేకమైన లక్షణాలు కనిపించవు, అప్పుడు కంటి చూపు క్రమంగా తగ్గడం మొదలవుతుంది. ఆ స్థితికి వచ్చాక ఏ వైద్యుడు చేసేదేమీ ఉండదు. అందువల్ల ఈ వ్యాధి సోకి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది కంటి చూపు కోల్పోతున్నారు. అలాగని ఈ వ్యాధి పట్ల విదేశాల్లో కూడా సరైన అవగాహన లేదు. దీనికి మందు ఏంటంటే ఎప్పటికప్పుడు డయాబెటిస్ ఉన్న వారు కంటి పరీక్షలు చేయించుకోవడమే. నగరాల్లో చేయించుకోవచ్చు, మరి నగర ఆసుపత్రి సౌకర్యాలు లేని పల్లెల మాటేమిటి. అక్కడ ఇలా కంటి పరీక్షలకు అవసరమైన పరికరాలు, శిక్షణా సిబ్బంది కూడా ఉండరు.

వీరిని కాపాడటానికి అత్యంత సులువుగా చేసే పరీక్ష కావాలి. సరిగ్గా అదే చేసింది అమెరికాలోని న్యూ యార్క్ కు చెందిన కావ్య కొప్పరపు. అమ్మాయి కూడా కాదు ఒక హై స్కూల్ విద్యార్ధిని, ఇండియా లో తన తాత ఈ DR సోకి చూపు కోల్పోవడం ఆమెను కదిలించింది. దాంతో తన సోదరుడు, సహా విద్యార్ధి సహాయంతో Eyeagnosis అనే ఒక యాప్ ను తయారు చేసింది. దీనికి అనుబంధంగా తయారు చేసిన ఒక 3D కళ్ళజోడు ద్వారా ఈ DR వ్యాధిని కనిపెట్టవచ్చు. ఈ యాప్ AI (Artificial Intelligence) ఆధారంగా పని చేస్తుంది.

ఇందుకోసం ఈమె Microsoft’s ResNet-50 అనే న్యురల్ నెట్వర్క్ ను ఎంచుకుంది. న్యురల్ నెట్వర్క్ అంటే మెషిన్ లెర్నింగ్ ను పై స్థాయికి తీసుకువెళ్తుంది అన్న మాట. సులువుగా చెప్పాలి అంటే ఒక వైద్యుడు తన అనుభవంతో చేసే పనిని ఒక పరికరం చూసి అర్ధం చేసుకుని చెబుతుంది. అంటే ఈ న్యురాల్ నెట్వర్క్ కు కొన్ని వేల రెటినా స్కాన్ లను చూపిస్తారు. తద్వారా అది నేర్చుకుంటుoదన్న కంటి స్కాన్లను చదవడం నేర్చుకుంటుంది. అలా వ్యాధిగ్రస్తమైన స్కా న్ ను చూపిస్తే అది తిరిగ గుర్తిస్తుంది.

కావ్య తన బృందంతో కలిసి ఈ న్యురల్ నెట్వర్క్ కు NIH (National Institute of Health) 34000 రెటీనా స్కాన్ లను చూపించింది. అలా ఈ న్యురల్ నెట్వర్క్ AI (Artificial Intelligence) ద్వారా DR ను గుర్తించగలిగింది.
ఇప్పుడు అతి పెద్ద సవాలు, కంటిని స్కాన్ తీయడం. సాధారణంగా ఇందుకోసం ఒక పెద్ద వైద్య సాధనం అవసరం. కానీ కావ్య ఇందుకోసం ప్రత్యేకంగా ఒక 3D ప్రింటెడ్ గ్లాసెస్ ను రూపొందించింది. అది కెమెరా ఫ్లాష్ ద్వారా కంటి వెనుక భాగాన్ని photo తీయగలవు. అలా స్కాన్, ఆ పైన ఈ యాప్ లో రోగ నిర్ధారణ జరుగుతుంది. ఇది సరే, దీనికి సంబంధించి ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ చేసే సమయం వచ్చింది. ఈ యాప్ ను కావ్య ముంబై ఆసుపత్రులలో పరీక్షించింది. ఈ యాప్ ద్వారా ఖచ్చితంగా డయాబెటిక్ రేటినోపతి నిర్ధారణ జరుగుతోంది. అయితే ఇది సరిపోదు, ఈ యాప్ అందుబాటులోకి రావాలంటే ఇది ఇంకా పల్లెటూళ్ళలో, చాలా ఆసుపత్రులలో దీనిని ప్రయోగించి ఆ సమాచారాన్ని విశ్లేషించి దీన్ని సామర్ధ్యాన్ని అంచనా వేస్తారు అని అన్నారు NIH కు చెందిన కంటి నిపుణులు J. Fielding Hejtmancik.

కావ్య తన Eyeagnosis ను గురించి March for Science in Washington, DC మరియు TEDx talk షోలలో ప్రదర్శించింది. ఏది ఏమైనా దీనిని అందుబాటులోకి తీసురావాలని పట్టుదలగా ఉంది కావ్య. ఇది అందుబాటులోకి వస్తే నిజంగానే ఎంతో మందికి మేలు జరుగుతుంది అనడంలో సందేహం లేదు కదూ.

Courtesy