Google Glasses

Google Glasses

స్మార్ట్ గ్లాసెస్ పేరు చెబితే మనకు గుర్తొచ్చేది గూగుల్ స్మార్ట్ గ్లాసెస్. అయితే ఈ గ్లాసెస్ ఊహించినంత విజయం సాధించలేదు. దానితో గూగుల్ సంస్థ దానికి మెరుగైన స్మార్ట్ గ్లాసెస్ తయారు చేసే పనిలో పడింది. అయితే ఈ లోపు Intel సంస్థ ‘Vaunt’ స్మార్ట్ గ్లాసెస్ ను తయారు చేసి దానిని మార్కెట్లోకి వదిలే పనిలో ఉంది. సరిగ్గా గూగుల్ నుంచి పాఠాలు నేర్చుకుని స్మార్ట్ గ్లాసెస్ మార్కెట్ ను కొల్లగొట్టేందుకు సిద్ధం అయింది. ఈ స్మార్ట్ గ్లాసెస్ పేరు ‘Vaunt’. ఈ గ్లాసెస్ ఎలా ఉంటాయో చూసేద్దమా.

Vaunt స్మార్ట్ గ్లాసెస్ సరిగ్గా మనం రోజువారి పెట్టుకునే ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ లా ఉంటాయి. గతంలో గూగుల్ మరియు ఇతర సంస్థలు రూపొందించిన స్మార్ట్ గ్లాసెస్ ఖచ్చితంగా ‘విచిత్రంగా’ ఉండటం వల్ల దానిని పెట్టుకోవడానికి, వాడటానికి వినియోగదారులు ఇష్టపడలేదు. అంతే కాదు దానిలో ఉండే ఫీచర్ల వలన కొన్ని కొన్ని ప్రదేశాల్లో పూర్తిగా ‘స్మార్ట్ గ్లాసెస్’ నిషేధించబడ్డాయి. కానీ ఈ Vaunt అచ్చం మనం పెట్టుకునే ఫ్రేమ్ లానే ఉంటుంది. ఇందులో ఒక ప్రత్యేకమైన లేసర్ ద్వారా కాంతి ఒక హోలోగ్రాఫిక్ అద్దం పై పడి ఆ కాంతి సమాచార రూపంలో మన కంట్లో ప్రతిఫలిస్తుంది. ఇలా మన ఫోన్లో వచ్చే పుష్ నోటిఫికేషన్స్, ఈమెయిలు మొదలైనవి, ఈ గ్లాసెస్ ద్వారా మన రెటీనాలోకి వచ్చి చేరతాయి. అయితే దీని వల్ల మన దృష్టికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం దృష్టి పధంలో కింద ఎక్కడో కనిపిస్తుంది ఈ సమాచారం. ఇలా కొద్ది నిముషాలు కనిపించి, మన కంటి చూపు ఆ నోటిఫికేషన్ పైన పడకపోతే ఆ నోటిఫికేషన్ మాయం అయిపోతుంది. ఈ గ్లాసెస్ లో ఎలాంటి కెమెరా, స్పీకర్స్, మైక్రోఫోన్ LCD స్క్రీన్ సైతం లేకుండా ఈ గ్లాసెస్ ను తయారు చేసింది. ఇవి ఉండడo చేతనే గూగుల్ గ్లాసెస్ విజయం సాధించలేక పోయింది. అందువల్ల ఈ Vaunt స్మార్ట్ గ్లాసెస్ తో అవతలి వారి ప్రైవసీ కి ఎలాంటి భంగం కలగదు.

ఈ Vaunt గ్లాసెస్ కేవలం 50 గ్రాముల బరువు ఉంటాయి. ఇక ఈ గ్లాసెస్ లో ప్రాసెసర్, accelerometer, బ్లూటూత్, కంపాస్ ఉన్నాయి. అయితే లేసర్ కిరణాలు కంటి పై పడటం వల్ల కంటికి ఏ మాత్రం కీడు లేదు. ఇవి low power laser కు చెందినవి, అలాగే ఈ లేసర్ కు US FDA అప్రూవల్ కూడా ఉండడం వల్ల ఇది పూర్తిగా సురక్షితం. ఇక ఈ గ్లాసెస్ బ్లూటూత్ ద్వారా ఫోన్ కు అనుసంధానం చేయబడి పని చేస్తాయి. అలాగే ఈ గ్లాసెస్ ఎలాంటి పవర్ ఉన్న వారైనా దీనిని వాడవచ్చు. అలాగే ఈ గ్లాసెస్ ద్వారా ఫోన్ లోని కాంటాక్ట్స్ కి ఫోన్ తీయాల్సిన అవసరం లేకుండా ఈ గ్లాసెస్ ద్వారా ఫోన్ చేయవచ్చు, అలాగే మాప్స్ వాడచ్చు ఇంకా చిన్న చిన్న టెక్స్ట్ మెసేజెస్ కూడా చేయచ్చు.

ప్రస్తుతం Intel ఈ స్మార్ట్ గ్లాసెస్ కు మెరుగులద్దే పనిలో ఉంది. అయితే మరి కొద్ది రోజుల్లో ఇది మార్కెట్లోకి విడుదల కానుంది.

Courtesy