చిలక దుంపను కొన్ని ప్రాంతాల్లో మోరంగడ్డ(Morram Gadda), మరి కొన్ని చోట్ల గుణసు గడ్డ(Genasu Gadda) అని కూడా పిలుస్తారు. దీర్ఘకాలం యవ్వనంగా ఉండేలా చేసే గుణం చిలకడ దుంపలో వుంది.సాధారణంగా చాలా రకాల దుంపలను డయాబెటిక్(Daibetic) రోగులు తీసుకోకూడదని అంటారు. కానీ ఇందులో గలిసెమిక్ ఇండెక్స్(Glycemic Index) తక్కువగా ఉండడం వల్ల డయాబెటిక్ వున్నా వారు పరిమితంగా తీసుకోవచ్చు అని న్యూట్రిషన్స్(Nutritions) ఇస్తున్న సలహా.

ఈ దుంపలను చాలా వరకు ఉడికించి నెయ్యి , పంచదార తో ఒక స్నాక్ లాగా తింటారు. వీటిలో ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) మెండుగా వున్నాయి. కేవలం ఆరోగ్య పరంగా కాకుండా, చిలగడదుంప(Sweet potato) తో రకరకాల స్నాక్స్(Snacks) కూడా ఎంతో టేస్టీ గా చేసుకోవచ్చు. చిలకడ దుంప లడ్డు, సాంబార్, పాయసం, పాంకేక్స్, కట్లెట్స్, చాట్, బిస్కెట్స్ లాంటివి ఎన్నో డిషెస్(Dishes) చేసుకోవచ్చు. తీపి బంగాళాదుంపను సాధారణంగా పచ్చిగా తీసుకుంటారు. కానీ దాని స్నాక్స్ చాలా పోషకమైనవి(Nutrients), ప్రయోజనకరమైనవి. మీరు కూడా ఈ వంటకాలను ప్రయత్నించాలనుకుంటే చాలా ఈజీగా  నేర్చుకోవచ్చు. అది ఎలాగో తెలియాలంటే ఇక్కడ చుడండి..

క్రిస్పీ చిలకడ దుంప కట్‌లెట్‌

కావలసినవి:

నానపెట్టిన సగ్గుబియ్యం – అరకప్పు

చిలగడ దుంప – పెద్దది ఒకటి

పుదీనా ఆకులపొడి – టీస్పూను

కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు

వడగట్టిన సొరకాయ తురుము – పావు కప్పు

జీడిపప్పు పొడి – రెండు టేబుల్‌ స్పూన్లు

జీలకర్ర పొడి – టీస్పూను

కారం – అరటీస్పూను

ఉప్పు – రుచికి సరిపడా

నూనె – మూడు టేబుల్‌ స్పూన్లు

తయారీ విధానం:

ముందుగా చిలగడ దుంపను ఉడికించి పొట్టు తీసి, మెత్తగా చిదుముకోవాలి. చిదుముకున్న దుంప మిశ్రమంలో మిగతా పదార్థాలన్నింటిని ఒక్క దాని తరువాత ఒకటి వేసి చక్కగా కలపాలి. ఇప్పుడు రెండు చేతులకు ఆయిల్‌ రాసుకుని మిశ్రమాన్ని కట్‌లెట్‌లా వత్తుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి, బాణలి పెట్టి అందులో ఆయిల్‌ వేయాలి. ఆయిల్‌ వేడెక్కిన తరువాత కట్‌లెట్‌లను వేసి రెండువైపులా క్రిస్పీ బ్రౌన్‌ కలర్‌లోకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతే  తియ్యటి కట్‌లెట్‌ రెడీ. ఏ చట్నీతోనైనా ఇవి సర్వ్(Serve) చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.

స్వీట్ పొటాటో చాట్..

కావాల్సిన పదార్థాలు..

స్వీట్ పొటాటో – 1/2kg

ఉప్పు – రుచికి సరిపడా

ఎండు యాలకుల పొడి – 1 tsp

నిమ్మకాయ – 2

నల్ల మిరియాల పొడి – 1 tsp

తయారీ విధానం..

ఒక ప్రెషర్ కుక్కర్‌లో  చిలగడదుంపను కడిగి పొట్టు తీసి ముక్కలుగా కోసి తగినన్ని నీళ్లు పోసి 2 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిన స్వీట్ పొటాటోస్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో  కట్ చేసుకున్న చిలకడ దుంప ముక్కలు, మసాలా దినుసులన్నీ వేసి, పైన ఎండుమిరియాల పొడి, ఎండు యాలకుల పొడి, ఉప్పు,వేసుకుంటే చాట్ రెడీ. ఈ చాట్(Chaat) ని స్నాక్స్ లాగ లేదా టీ టైం(Tea time) లో సర్వ్ చేయచ్చు.

స్వీట్ పొటాటో పాన్ కాక్స్

కావల్సిన పదార్థాలు:

స్వీట్ పొటాటో : 2 పెద్దవి

మెల్టెడ్ బట్టర్ : 2tbsp

సన్నగా తరిగిన పుదీనా : 2tsp

ఉప్పు : రుచికి సరిపడా

సన్నగా తరిగిన పచ్చిమిర్చి : 3

గుడ్డు : 2

మైదా : 1cup

బ్రెడ్ పొడి : 1/2cup

బేకింగ్ పౌడర్ : 1tsp

వెజిటేబుల్ ఆయిల్ : డీప్  ఫ్రైకి సరిపడా

తయారుచేయు విధానం:

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించి మ్యాష్ చేసిన  బంగాళదుంప, మెల్టెడ్  బటర్, పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు, మైదా, బ్రెడ్ పొడి, బేకింగ్ పౌడర్ ను వేసి మెత్తగా కలుపుకోవాలి. ఈ బంగాళా దుంప మిశ్రమ జారుగా వుండే లా చూసుకోవాలి, ఇప్పుడు ఒక సాస్ పాన్ స్టౌ మీద పెట్టి వేడయ్యాక దాని మీద వెజిటేబుల్ ఆయిల్ వేసి వేడయ్యాక అందులో పొటాటో మిశ్రమాన్ని దోసెలాగా వేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత పాన్ కేక్ మీద కొద్దిగా నూనె చిలకరించుకోవాలి. రెండు వైపులా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి . అంతే స్పైసీ అండ్ టేస్టీ స్వీట్ పొటాటో పాన్ కేక్ రెడీ.

ఈ వేడి వేడి పొటాటో పాన్ కేక్ కు సాస్(Sauce) లేదా గ్రీన్ చట్నీ(Green Chutney), బట్టర్ తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపిని వెంటనే ట్రై చేయండి.