ఒకప్పుడు ఫోటో దిగాలంటే కేవలం స్టూడియోలలోనే సాధ్యం అయ్యేది. అలాంటిది ఇప్పుడు దాదాపు ప్రతీ ఫోన్లో కెమెరా సౌకర్యం ఉంది. అయితే అదే ఫోన్ స్మార్ట్ ఫోన్ అయితే మరింత స్పష్టంగా ఎక్కువ పిక్సెల్ కలిగిన కెమెరా ఉంటుంది. అయితే ఈ సెల్ ఫోన్లు రాక మునుపు పోలారాయిడ్ కెమెరా ఉండేది. చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. ఇది కూడా photo తీసి వెంటనే ప్రింట్ చేస్తుంది, కానీ ఆ వచ్చిన ప్రింట్ కొద్ది సేపు చేత్తో పట్టుకుని అటూ ఇటూ ఊపితే కానీ photo వచ్చేది కాదు. ఇప్పుడు ఆ పోలరాయిడ్ కెమెరా కే కొద్ది మార్పులు చేసి మన ముందుకు వచ్చేసింది Polaroid Snap.

ఈ కెమెరా మన అరచేతిలో ఒదిగిపోతుంది. ఒకప్పటి పోలరాయిడ్ కెమెరా పెద్దదిగా, బరువుగా ఉంటే ఇది చాలా తేలిగ్గా మన చేతిలో ఇమిడిపోతుంది. దీనిలో 10 మెగాపిక్సెల్ కెమెరా ఉండడంతో photoలు అత్యంత స్పష్టంగా వస్తాయి. ఇది photo క్లిక్ చేసిన వెంటనే 2×3 కార్డు సైజు లో photo మన చేతిలో ఉంటుంది. సాధారణంగా ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక photo లు ఉంటాయి కానీ అవి ఒక జ్ఞ్యాపకం కావడం లేదు. ఎందుకంటే ప్రత్యేకించి ఫలానా photo లు ఎంచి వాటిని ప్రింట్ చేసేంత ఓపిక ఎవరికీ లేదు. ఇక్కడే ఈ కెమెరా విజయం సాధించింది. క్లిక్ చేసిన వెంటనే 10 మెగాపిక్సెల్ photo మన చేతిలో ఉంటుంది. దీనిలో 32 GB మైక్రోఎస్ఎడ్ కూడా ఉండడంతో photo లను save చేయగలగటం దీని ప్రత్యేకత. దీనిలో మనకు కలర్, ఒకప్పటి బ్లాక్ అండ్ వైట్, Vintage Sepia అనే మూడు విధాలైన ఫోటోలు తీసుకోవచ్చు. ఇది పూర్తిగా వైర్లెస్ అంటే దీనికి ఎలాంటి ఇంటర్నెట్, కంప్యూటర్ కనెక్షన్ అవసరం లేదు. ఈ కెమెరాలో photo లను ప్రింట్ చేయడానికి Zink Zero Ink ప్రింట్ టెక్నాలజీ ని వాడారు. అందువల్ల దీనిలో ఎలాంటి ఇంకు, కార్ట్రిడ్జ్ లు అవసరం లేదు. కేవలం స్నాప్, ప్రింట్, గో.

ఈ పోలరాయిడ్ కెమెరా ధర $99. ఈ కెమెరా నాలుగు రంగుల్లో లభిస్తుంది – తెలుపు, నలుపు, నీలం, ఎరుపు. దీనిలో ఫోటో ప్రింట్ పేపర్లను మనం దీనిలో అయిపోయిన ప్రతీ సారీ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వాటికి అదనంగా మరో $10 చెల్లించాల్సి ఉంటుంది. ఇది అమెజాన్లో లభిస్తుంది.