ఆరోగ్యం(Health)పై అందరిలో శ్రద్ధ పెరిగింది. పంచదార వాడకం వల్ల కలుగుతున్న ఆరోగ్య దుష్ప్రభావాల నుండి బయటపడేందుకు ఈ మధ్యకాలంలో తాటి బెల్లం(Palm Jaggery) వాడేవారి సంఖ్య బాగా పెరిగింది.

ఆయుర్వేదంలో తాటి బెల్లం వాడకం గురించి ప్రత్యేకంగా వివరిస్తుండటంతో అంతా తాటిబెల్లం వినియోగం వైపు మళ్ళుతున్నారు.

రోగనిరోధక శక్తి పెంచి(Incraese Immunity Power), రసాయన రహితమైన ఆర్గానిక్(Organic) తరహాలో తయారు చేసే తాటి బెల్లం వాడకం వైపు మొగ్గు చూపుతున్నారు. తాటి బెల్లం పూర్తిగా ఆర్గానిక్ కావడంతో పాటు, ఇందులో ఎక్కువ మొత్తంలో పోషకాలు ఉంటాయి. అధిక మొత్తంలో విటమిన్స్(Vitamins), మినరల్స్(Minerals) ఉండటమే కాకుండా ఇవి త్వరగా ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి. దీని వల్ల జీర్ణ సమస్యలు(Digestion Problems) ఉండవు.

గ్యాస్‌(Gas), అసిడిటీ(Acidity), మలబద్దకం(Constipation) నుంచి బయట పడవచ్చు. తాటి బెల్లంలో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఇది చక్కెర కంటే 60 రెట్లు ఎక్కువ ఖనిజాలను కలిగి ఉంది. అలాగే ఖనిజాలతో పాటు అనేక విటమిన్లు దీనిలో లభిస్తుంది.

ఈ బెల్లంలో చిన్నపాటి జబ్బులను దూరం చేయగలిగిన సుగుణాలు ఉన్నాయి, అంతేకాకుండా వివిధ రకాల అనారోగ్యాలకు ఈ తాటి బెల్లం తినడం ద్వారా చెక్ చెప్పొచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

తాటి బెల్లంలో తేమ 8.61 శాతం, సుక్రోజు 76.86, రెడ్యూసింగ్ చక్కెర 1.66, కొవ్వు 0.19, మాంసకృత్తులు 1.04, కాల్షియం 0.86, ఫాస్ఫరస్ 0.05, ఖనిజ లవణాలు 3.15 శాతం, ఇనుము ఉంటాయి. పోషక విలువలు సమృద్ధిగా ఉండటం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ తాటి బెల్లం చాలా ఉపయోగం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

తాటి బెల్లం జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా మలబద్ధకం సమస్యను కూడా తొలగిస్తుంది. ముఖ్యంగా తాటి బెల్లంలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. తాటి బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్(Anti Oxidant) అధికంగా ఉండటం వల్ల మన శరీరంలో దెబ్బతిన్న కణాల పునరుత్పత్తి జరుగుతుంది. అదేవిధంగా శ్వాసనాళం, జీర్ణ వ్యవస్థలలో ఏ విధమైన మలినాలు పేరుకుపోయినా అవి తొలగిపోతాయి. ఆయా వ్యవస్థలు శుభ్రంగా మారుతాయి. ఊపిరితిత్తులు, జీర్ణాశయం, పేగులు ఆరోగ్యంగా ఉంటాయి.

తాటి బెల్లంలో పోషక పదార్ధాలు(Nutrients) సమృద్ధిగా ఉండటం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. తాటి బెల్లంలో ఐరన్, క్యాల్షియం, పాస్పరస్ వంటి పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. వాటి వల్ల పోషణ లభిస్తుంది.మైగ్రేన్‌ వంటి అధిక తలనొప్పి సమస్య ఉన్నవారు తాటిబెల్లంను తింటే ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా ఈ బెల్లాన్ని తింటే అధిక బరువును తగ్గించుకోవచ్చు. తాటి బెల్లంలో ఇనుము(Iron) సమృద్ధిగా ఉంటుంది .

ఇది మీ రక్తంలో హేమోగ్లోబిన్ స్థాయి(Hemoglobin Levels)ని పెంచుతుంది మరియు ఆస్తమా(Reduce Asthma) ని తగ్గిస్తుంది. మరో వైపు ఇందులో ఉన్న మెగ్నీషియం(Magnesium) నాడీ వ్యవస్థ(Nervous system)ను నిమంత్రిస్తుంది. ఇదిలో ఎముకల(Bones)కు బలాన్ని ఇచ్చే కాల్షియం, పొటాషియం, మరియు భాస్వరం సమృద్ధిగా ఉంటాయి. తాటి బెల్లంలో ఎక్కువగా శక్తి కలిగి ఉంటాయి.

ఇది చక్కెర కంటే త్వరగా జీర్ణం అవుతుంది దాన్ని క్రమంగా తీసుకుంటే నీరసం అనేది రాదు శరీరానికి ఎక్కువ శక్తిని అందజేస్తుంది దీనిని రోజు తీసుకోవడం వలన శరీర పుష్టి(BodY Fat) మరియు వీర్య వృద్ధి(Sperm Growth) కలుగుతుంది. తాటి బెల్లం తినడం ద్వారా క్యాన్సర్(Cancer) కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది అలాగే శరీరంలో ఉండే విష పదార్థాలను బయటికి పంపిస్తుంది.

పొడి దగ్గు. ఆస్త్మా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి దానిని ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది.

గోరు వెచ్చని నీటిలో తాటి బెల్లం కలుపుకొని తాగడం వలన జలుబు(Cold), దగ్గు(Cough) నివారిస్తుంది.