ఎవరైనా ఒక వ్యక్తిని గుర్తించడానికి మనకు వేలి ముద్రలు (ఫింగర్ ప్రింట్) తీసుకోవడం ఏ నాటి నుండో ఉన్నదే. దానినే ఇప్పుడు ఐడెంటిఫికేషన్ కోసం ఫోన్లలో, లాప్టాప్లలో ఇంకా చాలా చాలా భద్రతా వ్యవస్థలలో ఉపయోగిస్తున్నాం. మరింత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థలో అంటే ఎయిర్ పోర్ట్ లలో, మిలిటరీ వంటి రంగాల్లో కనుగుడ్డు (iris), ముఖ కవళికలను బట్టి గుర్తించడం (facial recognition) వంటివి అందుబాటులో ఉన్నాయి. వీటికే బయోమెట్రిక్స్ (Biometrics) అని పేరు. ఇప్పుడు వీటన్నిటిని మించి పటిష్టంగా ఉండే CEREBRE – మరో బయోమెట్రిక్ పద్ధతి రాబోతోంది. అదే ఈ బ్రెయిన్ ప్రింట్.

అమెరికా లోని Binghamton University కి చెందిన పరిశోధకులు Sarah Laszlo మరియు Zhanpeng Jin సంయుక్తంగా చేసిన పరిశోధనలో వ్యక్తులను వారి వారి బ్రెయిన్ ప్రింట్ ద్వారా గుర్తించవచ్చని నిరూపించారు. అంటే ప్రతీ వ్యక్తి బ్రెయిన్ ప్రింట్ మరో వ్యక్తి కంటే భిన్నంగా ఉంటుంది అన్న మాట. సరిగ్గా ఈ సూత్రాన్ని ఆధారం చేసుకునే వీరు CEREBRE అనే ఒక బయోమెట్రిక్ ప్రోటోకాల్ ను రూపొందించారు. ఇందుకోసం వీరు ఒక ప్రయోగం చేసారు. ఈ ప్రయోగంలో ప్రధానంగా వ్యక్తుల మెదడు లోని తరంగాలను విశ్లేషించి గుర్తించగలగడం విశేషం. ఇక ఈ ప్రయోగంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరు తమ మెదడులోని తరంగాలను విశ్లేషించేoదుకు వీలుగా electroencephalograph headset ను ధరించాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ 50 మందికి కంప్యూటర్ లో 500 చిత్రాలు చూపించారు. ఉదా: పిజ్జా, హాలీవుడ్ నటి ఇలా మొదలైనవి. ఇందులో కొన్ని ఉమ్మడిగా అందరికీ తెలిసినవే అయినప్పటికీ దానికి వారి వారి మెదడులోని స్పందన ప్రతీ ఒక్కరికీ భిన్నంగా ఉంది. అంతేకాదు ఈ బ్రెయిన్ ప్రింట్ ద్వారా ప్రతీ వ్యక్తిని నూటికి నూరు శాతం ఖచ్చితంగా గుర్తించడం విశేషం. ఇలా తమ మెదడులోని స్పందన (brain activity) వారికే తెలియకపోవడం దీని ప్రత్యేకత.

అందువల్ల దీనిని మరొకరు దొంగిలించడం, అనుకరించడం జరగని పని. ఇది బయోమెట్రిక్స్ లోని విప్లవానికి కారణమవుతుందని Sarah అంటున్నారు. అయితే గతంలోనే ఇలా బ్రెయిన్ ప్రింట్oగ్ కోణంలో చాలా మంది పరిశోధనలు చేసినా Sarah మరియు Zhangpeng మాత్రమే దానిని అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా వీరు తమ పరిశోధనాంశాలను IEEE Transactions on Information Forensics and Security (abstract) లో ప్రచురించారు.

Courtesy