టెస్లా(Tesla) అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) చేతుల్లోకి ట్విటర్ సంస్థ(Twitter Company) వచ్చేసింది.44 బిలియన్ డాలర్లు(44 Million Dollars) చెల్లించి ఆయన ఈ ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకున్నారు. దీంతో త్వరలోనే ఆయన ట్విట్టర్ సంస్థను తన అధీనంలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం మస్క్ చేతిలోనే ట్విట్టర్ సంస్థ పాలనా పగ్గాలు ఉండనున్నాయి. ఎలాన్ మస్క్ కొనుగోలుతో ట్విట్టర్ షేర్ హోల్డర్ల(Share Holder) పంట పండినట్లే అని విశ్లేషకులు(Experts) అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తాజా పరిణామాలతో ట్విట్టర్ షేర్ల ధరలు(Twitter Shares Price) ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి(Increases). కార్పొరేట్ దిగ్గజంగా ఎదగడంతో ట్విట్టర్ షేర్ల ధరలు పుంజుకుంటున్నాయి.

మరోవైపు ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లాక ట్విట్టర్ భవిష్యత్(Future) ఎలా ఉంటుందో అర్థం కావడం లేదని ఆ సంస్థ సీఈవో(CEO) పరాగ్ అగర్వాల్(Parag Agarwal) ఉద్యోగులతో చెప్పారు. ప్రస్తుతం సంస్థలో ఎవరినీ తొలగించే ఉద్దేశం లేదని, కొనుగోలు ఒప్పందం(Contract) పూర్తయ్యే వరకు తానే సీఈవోగా ఉంటానని తెలిపారు. డీల్(Deal) పూర్తయ్యేందుకు 3 నుంచి 6 నెలలు పట్టవచ్చని పేర్కొన్నారు. కాగా ఒకవేళ ట్విట్టర్ సీఈవోగా పరాగ్‌ అగర్వాల్‌ను తొలగించాల్సి వస్తే ఆయనకు కంపెనీ 42 మిలియన్ డాలర్లు(42 Million Dollars) చెల్లించాల్సి ఉంటుందని సమాచారం .