టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందడంతో మన దైనందిన జీవితంలోని దేశ, కాల, వస్తు పరిమితులు అంతే వేగంగా చెరిగిపోతున్నాయి. టెక్నాలజీ యొక్క విప్లవాత్మకమైన ఆవిష్కరణలలో మొబైల్ ముఖ్యమైనది. ఇది మన జీవనశైలిలో పెను మార్పులు తీసుకువచ్చింది….తెస్తూనే వుంది. మొబైల్ తో అనుసంధానం చెంది బ్యాంకింగ్ మొదలైన సేవలన్ని సులభతరమైనాయి.

ఇప్పుడు సరి కొత్తగా మన నిత్య జీవనంలో భాగమైన “ఎలక్ట్రికల్ స్విచ్” మొబైల్ తో అనుసంధానమై “గెకో స్విచ్” గా మన ముందుకు వచ్చింది. ఇది ఎలా పని చేస్తుందో చూద్దాం. దీని ద్వారా మన ఇంటిలోని ఏ ఫ్యాన్, లైట్ లేదా తలుపును కంట్రోల్ చేయాలి అనుకున్నామో దాన్ని మొబైల్ ద్వారా ప్రోగ్రాం చేసుకోవచ్చు. అంతే ఇది ఎలక్ట్రికల్ కనెక్షన్ లేకుండా మొబైల్ ద్వారా పనిచేస్తుంది. మొబైల్ ఇంటర్ పేస్ వుండడం వల్ల టైమర్, డిలే వంటి ఆప్షన్స్ వున్నాయి. అలా ఈ స్విచ్ ను మన పక్కనే పెట్టుకొని ఇంటి లోని దేన్నైనా ఆపరేట్ చేయచ్చు. ఈ గెకో స్విచ్ ను గోడ మీద లేదా గ్లాస్ మరి దేనిమీదనైన అతికించవచ్చు. అలా ఎన్ని సార్లు తీసేసిన గోడ మీద ఎటువంటి మచ్చ పడని విధంగా ఈ స్విచ్ ను డిజైన్ చేసారు.

ఇటువంటివి అందుబాటులోకి వస్తే వికలాంగులకు, ముసలివారికి ఎంతో సౌకర్యంగా వుంటుంది. వారి జీవనంలో ఇటువంటివి సంతోషాలు నింపుతాయి.

gecko_switch_1 gecko_switch_2 copy gecko_switch_3 gecko_switch_4 gecko_switch_5 gecko_switch_6 gecko_switch_7 gecko_switch_8 gecko_switch_9 gecko_switch_10 gecko_switch_11 gecko_switch_12 gecko_switch_13

Courtesy