చైనా, ప్రపంచ దేశాలన్నింటికి ఇప్పటికి వేస్ట్ పేపర్ నుంచి పెన్సిల్ తయారుచేసే చాల మెషిన్స్ తయారు చేసి ఇచ్చింది. కాని అవి సైజు లో చాల పెద్దవి. కింద శాంపిల్ పిక్చర్ చూడండి.

wpp-last

ఇప్పుడు సరికొత్త ఆవిష్కరణకి చైనా రూపం ఇచ్చి పీ&పీ ఆఫీస్ వేస్ట్ ప్రాసెసర్ అనే సరికొత్త మెషిన్ ని రూపొందిచింది. ఈ మెషిన్ ద్వారా మనం ఎప్పటికప్పుడు వేస్ట్ పేపర్ ని ఉపయోగించి పెన్సిల్స్ ని (పేపర్ బేస్డ్) తయారుచేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది సైజు లో చాల చిన్నది. మరియు మీరు ఒక పెన్సిల్ తయారు చెయ్యటానికి ఉపయోగించవల్సినదల్లా వేస్ట్ పేపర్స్ మరియు గ్రాఫైట్ స్టిక్స్(పెన్సిల్ స్టిక్స్).

ఈ డిజైన్ ని రూపొందించింది చైనా కి చెందిన నలుగురు డిజైనర్లు చెంగ్జు రుయన్ (  Chengzhu Ruan ), యుయన్ యుయన్ లియు  (Yuanyuan Liu ), క్షిన్వెఇ యుయన్ ( Xinwei Yuan ) మరియు చావో చెన్ (Chao Chen). ఈ మెషిన్ ఇంకా ప్రొడక్షన్ లోకి రాలేదు కాని ఈ ఐడియా చాల బాగుంది కాదు. ఈ మెషిన్ ప్రొడక్షన్ లోకి వస్తే స్కూల్స్ లో, ఆఫీసుల్లో ఇంకా చాల చోట్ల బాగా ఉపయోగపడుతుంది.

దీనికి సంబంధించిన పిక్చర్స్ కింద చూడండి.

wpp_1

wpp_2

wpp_3

wpp_4

wpp_5

wpp_6