నీళ్ళు. చంటి పిల్లల నుంచి పెద్దవారి దాకా ఇవి అత్యంత వినోదాన్ని ఇస్తాయి. అందుకీ సముద్రాలూ, నదులు, చెరువులు, జలాశయాల పట్ల ఎంతో మక్కువ చూపుతాం. ఈ జల విహారాలు ఎంతటి వినోదాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయో కించిత్ అజాగ్రత్తగా వుంటే పెను విషాదాన్ని మిగల్చుతాయి. పిల్లలు, పెద్దవారు అదుపు తప్పి నీళ్ళల్లో కొట్టుకుపోవడం మనం వింటూనే వుంటాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 3 లక్షల పై చిలుకు మంది నీట మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటివి ఆపడానికే, తన స్వానుభవం మిగల్చిన విషాదం లోంచి పుట్టిందే ఈ “కెనె గీ” అంటున్నారు అమెరికాకు చెందినా టామ్ అథనాసిఅస్.

Kingi_2Kingii_1

ఇది చేతి గడియారం లాంటి ఒక పరికరం. దీనిలో ముఖ్యమైనవి లెవర్ (pull lever), CO2 క్యాట్రిడ్జ్ (catridge), ప్లాస్టిక్ బ్యాగ్(balloon) కంపార్ట్మెంట్ అనే మూడు భాగాలు. దీనిని ధరించిన వ్యక్తి ఆపద సమయంలో ఈ లేవర్ ను లాగితే చాలు, ఒక్క సెకెనులో ఈ బ్యాగ్ లోకి CO2 గ్యాస్ నిండి బెలూన్ అవుతుంది. ఈ బెలూన్ నీట మునుగుతున్నవ్యక్తి  పైకి తేలడానికి ఆసరాగా ఉపయోగపడుతుంది. ఇది ఎంతటి స్థులకాయులకైనా ఉపయోగపడే విధంగా దీన్ని రూపొందించారు.

Kingi_3Kingi4

దీనిని ఆరేళ్ళ పిల్లల నుంచి పెద్దవారి దాకా అందరికి సరిపోయే విధంగా తయారుచేసారు. అవసరానికి తగ్గట్టు ఈ క్యాట్రిడ్జ్ ను మార్చుకుంటే చాలు, ఇది ఎంత కాలమైనా పని చేస్తుంది. ప్రస్తుతం ఈ పరికరాన్ని పేటెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు దీనిని తయారుచేసిన టామ్ అథనాసిఅస్.

vy2rfrxyxojxbusuzpzvxzcn3f0ojvx1oa0fslouKingiGIf3

ఇతని ప్రయత్నం ఫలించి, ఈ పరికరం ఎంతో మంది ప్రాణాలు కాపాడాలని ఆశిద్దాం.

Courtesy