చక్కర వ్యాధి (diabetics). ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఇది వంశ పారంపర్యంగా సంక్రమించినా, మారుతున్న జీవన శైలి, మారుతున్న ఆహారపుటలవాట్లు ఈ వ్యాధికి కారణాలుగా నిలుస్తున్నాయి. ఇక ఈ వ్యాధి బారిన పడితే, వ్యాధి తీవ్రతను బట్టి, రక్త పరీక్షలు, దాని రిపోర్టులు అంటూ డాక్టర్ల చుట్టూ తిరగాలి. ఈ మధ్య కాలం లో షుగరు ఎంతో వుందో మనకై మనమే తెలుసుకోవడానికి చిన్న మిషన్లు కూడా వచ్చాయి.

diabetic_1

అయితే లాబ్లో చేసే రక్త పరీక్షకైనా, లేదా ఇంట్లో స్ట్రిప్ ద్వారా చేసుకొనే పరీక్ష కైనా విధానం ఒక్కటే. అది, వేలికి సూది గుచ్చి, ఆ రక్తాన్ని పరిక్షించడం. ఒక్క షుగరు వ్యాధికే కాదు అసలు ఏ వ్యాధికైనా రక్త పరీక్ష ఈ విధంగానే చేస్తారు. ఇప్పుడిక అటువంటి విధానానికి స్వస్తి పలకమంటున్నారు బ్రిటన్ లోని లీడ్స్ యూనివర్సిటీ (Leads university) కి చెందిన నిపుణులు. వారు ఒక కొత్త పరికరాన్ని తయారు చేసారు, అదే లేజర్ స్కానర్ (Laser scanner). ఇక దీని పని తీరును పరిశీలిద్దాం. నానో సిలికా (Nano silica) మెటీరియల్ తో తయారైన ఈ అద్దం మీద మన వేలు పెడితే వచ్చే వత్తిడి వల్ల, ఉత్పన్నమయ్యే ఫ్లోరొసెన్స్ సిగ్నల్స్ ఆ వ్యక్తి రక్తం లోని గ్లూకోజ్ శాతం (sugar levels) ఎంత ఉందో తెలియపరుస్తుంది. ఆ విధంగా ఈ పరికరం లోని అద్దం మీద వేలు ఉంచితే చాలు, ఆ వ్యక్తి రక్తం లోని గ్లూకోజ్ శాతాన్ని లెక్క కట్టి చూపిస్తుంది. ఈ విధంగా మనం ఇంట్లో వుండే, రోజుకు ఎన్నిసార్లైనా షుగరు ఎంత వుందో చూసుకోవచ్చు.

diabetic_2

ఇది మార్కెట్లో దొరికే మిగతా పరికరాల కంటే చౌకగా లభిస్తుంది. ఈ పరికరం తక్కువ శక్తిని వినియోగించడం వల్ల ఇది చాలా రోజులు నిరంతరాయంగా పని చేస్తుంది. పైగా దీనిలోని అద్దం మన ఫోన్లలో వుండే అద్దం వంటిది, కాబట్టి కింద పొరపాటున పడినా అంత తేలిగ్గా పగలదు.

diabetic_3

ఇటివంటి పరికరాలు రోగులకు అందుబాటులోకి వస్తే నిజంగా వారికి ఎంతో మేలు జరిగినట్టే.

courtesy