సూది మందు (Injection). ఇది మన అందరికీ సుపరిచితమే. చిన్నతనం నుంచి దీని బారిన పడని వారు వుండరు. ఇంచుమించు ఆంగ్ల వైద్యం మొదలైనప్పటి నుంచి ఈ సూది మందును ఉపయోగిస్తున్నారు. పిల్లల నుంచి పెద్ద వారి దాకా అందరూ దీనికి ఎప్పుడో ఒకప్పుడు భయపడే వుంటారు. ఇక చిన్న పిల్లలనైతే సూది మందు (injection) పొడుస్తామని బెదిరిస్తుంటాము కూడా. ఇక ఆ భయం అవసరం లేదు అంటున్నారు ఒసాకా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. వైద్య శాస్త్రంలో జరుగుతున్న పరిశోధనలు సూది మందుకు ప్రత్యామ్న్యాయా లను వెతుకుతున్నాయి. ఈ ప్రక్రియలో ఒక కొత్త సూది వెలుగులోకి వచ్చింది. అదే ఈ సూక్ష్మ సూది (Micro needle).

dissolve_patch_4

ఈ సూది కంటికి కనిపించదు. ఒక చిన్న ప్యాచ్ (patch) వంటి దాని మీద వుంటుంది. దీనిని సూది మందు వేయాల్సిన వారి వెలికి అతికిస్తారు. అంతే, కొద్దిసేపట్లో ఆ మందు తో పాటు ఆ ప్యాచ్ కూడా మన శరీరంలో కరిగిపోతుంది (dissolv). ఏ విధమైన మొప్పి ఇంకా బాధ లేకుండా సూది మందు వేసుకున్నట్టే. ఇది పూర్తిగా సురక్షితం. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్లు వుండవు.

dissolve_patch_2

సాధారణ సూది మందు వేయాలంటే దానికి ప్రత్యేకమైన సామగ్రి మరియు సిబ్బందికి శిక్షణ అవసరం. పైగా ఈ సూదులను సరిగా స్టేరిలైస్ (sterilize) చేయకపోతే డాని వల్ల కొన్ని రోగాలు సంక్రమిస్తాయి. అసలు కొంత మంది దీనికి భయపడే వేరే వైద్య విధానాలను ఆశ్రయిస్తుంటారు. ఈ సూక్ద్మ సూదికి అటువంటి ఇబ్బంది ఏమి లేదు. దీనిని ఎవరైనా వేసుకోవచ్చు. పైగా సాధారణ సూదితో పోలిస్తే ఈ సూక్ష్మ సూది మరింత సమర్ధవంతంగా పని చేస్తుంది.

dissolve_patch_1

ప్రస్తుతం దీనిని పూర్తిగా సూదికి ప్రత్యామ్న్యాయంగా వాడటం లేదు. దీనిని వాక్సిన్లకు (vaccines) మాత్రమే దీనిని పరిమితం చేసారు. ఈ సూక్ష్మ సూదిని ఎప్పుడైనా పెద్ద సంఖ్యలో వాక్సిన్ లు అవసరమైనప్పుడు, అంటే ఏదైనా విపత్తు సంభవించినప్పుడు అంటు రోగాలు ప్రబలే అవకాశం వుంటుంది. అటువంటప్పుడు ఈ సూక్ష్మ సూది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మారుమూల ప్రాంతాల్లోని వారికి ఈ సూక్ష్మ సూది వాక్సిన్ లను పంపిణి చేస్తే, వారు వైద్య సహాయం అందే లోపు వారిని వారు సురక్షితంగా వుంటారు.

ఇక మీద ఎవరికైనా నొప్పి లేకుండా మందు వేయించుకోవచ్చు. కాబట్టి, ఈ సూక్ష్మ సూది త్వరలోనే అందరికీ అందుబాటులోకి రావాలని ఆశిద్దాం.

Courtesy