https://youtu.be/X8jxjwyoCBU

హెల్మెట్ లు మనం ఏదైనా వాహనం నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా తలకు రక్షణగా పెట్టుకుంటాo. అది మోటార్ బైక్ కావచ్చు లేదా సాధారణ బైక్ కావచ్చు. ఈ బైక్ అంటే ఇంచుమించుగా మన సైకిల్ లాంటిదే విదేశాల్లో ఎక్కువ మంది వినియోగిస్తారు. ఇప్పుడిప్పుడు తక్కువ దూరాలకు, వ్యాయామ రిత్యా కూడా మన దేశంలో కూడా ఉపయోగిస్తున్నారు. అయితే దీనికైనా helmet తప్పనిసరి. ఈ బైక్ వాడుతున్నవారంతా హెల్మెట్ పెట్టుకోవడం లేదు. కారణం అది ఖరీదైనది, బరువైనదీ కావడమే. ఈ ఇబ్బందిని తొలగించి సైక్లింగ్ ను మరింత సురక్షింతంగా చేసేందుకు ఒక తేలికైన హెల్మెట్ ను తయారు చేసింది UK కి చెందిన Isis Shiffer అనే . అదే ఈ Eco Helmet. అదేంటో ఎలా ఉంటుంది చూద్దామా.

Shiffer కు ఇలాంటి ఒక helmet ను తయారు చేయాలనే ఆలోచన తానూ ఎన్నో దేశాలు తిరిగేటప్పుడు అక్కడ బైక్ మీద వెళ్ళేదాన్నని అప్పుడు హెల్మెట్ సమస్య ఎదురయ్యేదని అప్పుడే తనకు ఇలాంటి ఒక చౌకగా, తేలిగా ఉండే హెల్మెట్ తయారు చేయాలనే ఆలోచన వచ్చిందని చెబుతుంది. ఈ Eco helmet పూర్తిగా కార్డుబోర్డ్ పేపర్ తో కొన్ని పొరలు పూర్తిగా ఒక ప్రత్యేకమైన క్రమoలో ఎంతో తేలిగ్గా తయారు చేయబడింది. ఇది పేపర్ తో తయారైంది కావడంతో ఇది పూర్తిగా రీసైకిల్ చేయబడుతుంది అలాగే ఇది బయోడీగ్రేడబుల్ కూడా కావడం దీని ప్రత్యేకత. ఇది చూడడానికి ఒక అరటి పండు పరిమాణంలో ఉండి తల మీద పెట్టుకునేటప్పుడు పూర్తి గా విచ్చుకుని హెల్మెట్ తరహా లో కనిపిస్తుంది. పేపరే కదా అని తీసిపారేయకండి ఈ Eco helmet ను అమెరికా లో అక్కడి సేఫ్టీ స్టాండర్డ్ లను కలిగి ఉందని ఇక్కడి వీడియో లో చూడవచ్చు. అంతే కాదు దీనితో పని అయిపోయాక దీనిని మడత పెట్టి ఏ బ్యాగ్ లోనైనా పెట్టుకోగలగడం దీని ప్రత్యేకత. అందుకే ఇంతటి తేలికైన, చౌకైన పర్యావరణ మిత్రత్వం కలిగిన helmet ను తయారు చేసినందుకు ఈ Eco Helmet కు ప్రతిష్టాత్మకమైన 2016 James Dyson Award దక్కింది.

ఈ హెల్మెట్ ను అన్ని దేశాల్లోని వారు ఉపయోగించగా చూడటమే తన కల అని Shiffer పేర్కొంది. ఈ అవార్డు లో భాగంగా ఆమెకు $45,000 నగదు బహుమతి లభించింది.