Detoxification – నిర్విషీకరణ

మానవుని శరీర రక్తంలో ఉండే విషపదార్థాలను శుద్ధి చేసే ప్రక్రియనే ”నిర్విషీకరణము” అంటారు. మాములుగా శరీర అవయవాలైన ఊపిరితిత్తులు, శోషరసం, మూత్రపిండాలు, కాలేయం ఇంకా చర్మం రక్తంలో ఉన్న మలినాలను ఫిల్టర్ చేసి తొలగిస్తాయి. ఎప్పుడైతే మన జీవన విధానంలో లేదా తీసుకునే ఆహార పదార్థాలు లేదా వైద్య మందులు వల్ల ఈ విషపదార్థాలు ప్రమాద స్థాయికి చేరుకొని అవి ఫిల్టర్ కాక రక్తంలో కలిసి అనారోగ్యాలను తెచ్చిపెడతాయి. అటువంటి సమయంలో నిర్విషీకరణ చేసుకోవడం చాలా ముఖ్యం.

నిర్విషీకరణ అనేది మనం ఆహార పద్దతుల ద్వారా చేసుకోగలం. అటువంటి వాటిలో, అతి సులభమైన 4 రకాలైన జ్యూసులు (juices) గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1. గ్రీన్ టీ + పోదీన ఆకులు + ఆకుపచ్చ నిమ్మ కాయ + నీళ్ళు (6 – 12 ఔన్సుల గ్లాస్)

             green tea  menta  lime waterglass

గ్రీన్ టీ గురించి మీరు వినే ఉంటారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే యాంటిఆక్సిడెంట్స్ ఇందులో ఉండటం వల్ల మనకు ఎంతో మేలు. అటువంటి టీ కి పుదీనా ఆకులు, ఆకు పచ్చ నిమ్మకాయ తోడైతే ఇక చెప్పాల్సిన పని లేదు. అప్పుడు అది ఒక అద్భుతమైన ఔషధం. తల నొప్పులను పోగొట్టడమే కాకుండా శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగిస్తుంది. ఈ పానీయాన్నిసంవత్సరం పాటు రోజు ఉదయాన్నే సేవిస్తే అది గౌట్ (gout) అనే కీళ్ళ నొప్పుల జబ్బు నుంచి శాస్వతంగా ఉపసమనం ఇస్తుంది.

 

2. కీర దోసకాయ +  స్ట్రా బెర్రీ + కివి + నీళ్ళు (6 – 12 ఔన్సుల గ్లాస్)

              cucumber strawberries Kiwi 2 waterglass

కీరదోసకాయ, స్ట్రా బెర్రీ, కివి ఈ 3 టి కాంబినేషన్ తో తయారయ్యే పానీయం ఎంతో రుచిగానే కాకుండా రక్తంలోని షుగర్ శాతాన్నితగ్గకుండా ఉంచుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ ని అబివృద్ది పరచి మలినాలను తొలగించేందుకు ఉపయోగపడుతుంది.

 

3. కీర దోసకాయ +  ఆకుపచ్చ నిమ్మ కాయ + పసుపు పచ్చ నిమ్మకాయ + నీళ్ళు (6 – 12 ఔన్సుల గ్లాస్)

               cucumber lime lemon waterglass

కీరదోసకాయ, లెమన్, ఆకు పచ్చనిమ్మ ఇవి శరీరంలో మలినాలను తొలగించడమే కాకుండా, డీ హైడ్రిషన్ అవ్వకుండా ఆకలిని కూడా అదుపులో ఉంచుతుంది.

 

4.  పసుపు పచ్చ నిమ్మకాయ + ఆరంజ్ +  ఆకుపచ్చ నిమ్మ కాయ + నీళ్ళు (6 – 12 ఔన్సుల గ్లాస్)

              lemon orange lime waterglass

ఆకుపచ్చనిమ్మ, ఆరంజ్, లెమన్ ఈ 3 కాంబినేషన్ డ్రింక్స్ శరీరంలో జీర్ణ వ్యవస్థను సక్రమంగా పని చేసేలా చేసి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.