తెలుగు షార్ట్ ఫిల్మ్(Telugu Short Film) `మనసానమః`(Manasanamaha) అరుదైన ఘనతని దక్కించుకుంది . సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ చిత్రం తాజాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గిన్నిస్‌ రికార్డు(Guinness record)ని సొంతం చేసుకుంది.

అత్యధిక అవార్డులు పొందిన షార్ట్  ఫిలింగా మనసానమః` వరల్డ్ రికార్డ్(World Record) సృష్టించి, గిన్నిస్‌ రికార్డ్ లో స్థానం సంపాదించింది.

ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అవార్డులు సహా ఆస్కార్‌ క్వాలిఫై(Oscar Qualify)కు వెళ్లిన ఈ లఘు చిత్రం ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే(Dada Sahib Phalke) ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివెల్(IFF) లో బెస్ట్ షార్ట్ ఫిలిం(Best short Film)గా ఎంపికై ఆశ్చర్యపరిచింది.

రీసెంట్ గా `మనసానమః` జాతీయ, అంతర్జాతీయంగా అత్యధిక పురస్కారాలు గెల్చుకున్న చిత్రంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్(Gunnies Book of World Record)  లో స్థానం దక్కించుకుంది. గిన్నీస్ రికార్డ్స్ లో ఎక్కిన మొదటి  తెలుగు లఘు చిత్రం(First short film)గా చరిత్ర సృష్టించింది.

ఇది గిన్నీస్‌ లెక్కల ప్రకారం 513 అవార్డుల(513 Awards)ను దక్కించుకోగా, ఇతర అన్ని అవార్డులు కలుపుకుని 900లకుపైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెల్చుకుంది. ఆస్కార్(Oscar), బప్టా(Bafta) లాంటి ప్రతిష్టాత్మక అవార్డుల(Prestigious Awards)కు క్వాలిఫై అయ్యింది. తాజాగా గిన్నీస్ బుక్ లోనూ చోటు దక్కించుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమ(Film Industry)కు గర్వకారణం.

విరాజ్‌ అశ్విన్‌(Viraj Aswin) హీరో(Hero)గా నటించిన `మనసానమః`లో ధృషిక చందర్(Drushika Chander), శ్రీవల్లి రాఘవేందర్(Srivalli Raghavendra), పృథ్వీ శర్మ(Prudhvi Sharma) హీరోయిన్లు(Heroines)గా నటించారు. గజ్జల శిల్ప(Gajjala Shilpa) నిర్మాణం(Production)లో దర్శకుడు(Director) దీపక్ రెడ్డి తన తొలి ప్రయత్నంగా `మనసానమహః` షార్ట్ ఫిలింను తెరకెక్కించారు.

యూట్యూబ్(Youtube) లో రిలీజైన ఈ షార్ట్ ఫిలిం అనేక జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఇదిలా ఉంటే ఈ లఘు చిత్రం గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకున్న సందర్భంగా నేషనల్‌ క్రష్‌(National Crush) రష్మిక మందన్న(Rashmika Mandanna) విషెస్(Wishes)  తెలిపింది. గతంలో ఆమె ఈ షార్ట్ ఫిల్మ్ చూసి అప్రిషియేట్‌(Appreciate) చేయగా, మళ్లీ ఆ విషయాన్ని గుర్తు చేస్తూ దీపిక్‌ రెడ్డి ట్వీట్‌(Deepak Reddy Tweet) చేశారు. దీనికి రష్మిక స్పందించింది. ప్రస్తుతం ఆమె ట్వీట్‌ వైరల్‌(Tweet Viral అవుతుంది.