Cancer (కాన్సర్). ఇది ఒక ప్రాణాంతకమైన జబ్బు. ఇక సరైన వైద్యం అందక పోతే ప్రాణాలకే ప్రమాదం. ఈ కాన్సర్లు ఎన్నో రకాలు throat కాన్సర్, blood కాన్సర్, breast కాన్సర్, prostate కాన్సర్ ఇలా ఎన్నో. అందులోనూ ఆడవారికి ఒక రకమైన కాన్సర్లు, మగ వారికి ఒక రకమైన కాన్సుర్లు రావడం మనం వింటూనే ఉంటాం. ఏదైనా ఈ కాన్సర్ మాత్రం ఆది లోనే గుర్తించగలిగితే అప్పుడు వారికి చికిత్స సులభతరం కూడా. సరే, మన భారత మరియు అభివృద్ధి చెందిన దేశాల్లో దీన్ని గుర్తించడానికి ఎన్నో ఆసుపత్రులు అలాగే ఎంతో equipment కూడా ఉంది. మరి అభివృద్ధి చెందని దేశాల్లో కొన్ని కోట్ల మంది దీని బారిన పడి ఆదిలోనే గుర్తించలేక ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు వ్యాధి నిర్ధారణ జరుగకే ఎంతో మంది చనిపోవడం బాధాకరమైన విషయం. ఈ సమస్యను, వీరి పరిస్థితిని చూసి చలించిన ఒక ప్రొఫెసర్ ప్రపంచంలో మొట్ట మొదటి సరిగా ఎలాంటి భారీ భారీ మెషీన్లు అవసరం లేకుండా కేవలం ఒక చిన్న బ్రీఫ్ కేసు లో ఈ కాన్సర్ ను గుర్తించడానికి కావలసిన వస్తువులను తయారు చేసాడు. అదే ఈ lab-in-a-briefcase.

Breast Cancer

UK లోని Loughborough University కి చెందిన chemical engineering professor Dr. Nuno Reis ఈ కాన్సర్ ను గుర్తించడానికి ఒక చిన్న lab ఎక్విప్మెంట్ ను ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్లగలిగేలా తయారు చేసాడు. ఇక దీన్లో 4 భాగాలు ఉన్నాయి. అవి multi syringe device, micro well plates, portable USB powered film scanner, computer for real time data analysis. ఇవి ఎలా పని చేస్తాయంటే ఈ syringe ద్వారా సేకరించిన రక్తం ద్వారా పూర్తిగా 80 రకాల టెస్ట్లు చేస్తుంది. ఇక ఈ రక్తాన్ని యధాతధంగా ఇందుకు ఉపయోగించడం విశేషం. ఇక రెండో భాగమైన microfluidic test strip లోని ఈ micro well plates మన వెంట్రుక అంత మoదం లో ఉండి chemical reagent లతో నిండి ఉండటo చేత దీనితో వివిధ రకాల కాన్సర్లను గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఇవి కాన్సర్ biomarkers (ఇవి రక్తంలో కాన్సర్ కారక జన్యువు) ద్వారా రక్తంలో కాన్సర్ ను గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఈ test స్ట్రిప్స్ disposable కావడం మరో విశేషం. ఈ స్ట్రిప్స్ ను ఇమేజ్ స్కానర్ ద్వారా స్కాన్ చేసి ఆ సమాచారాన్ని ఈ కంప్యూటర్ లో data analysis ద్వారా కేవలం 15 నిముషాల్లో ఈ పరీక్ష పూర్తవుతుంది. ఇందుకోసం ఎక్కువ సిబ్బంది అవసరం లేదు. అలాగే దీన్ని ఆపరేట్ చేసే వ్యక్తికి కూడా కొద్ది పాటి శిక్షణ తో దీన్ని సులువుగా ఆపరేట్ చేయచ్చు.scientist

దీని ద్వారా ఇప్పటికే Dr. Reis విజయవంతంగా prostate కాన్సర్ ను గుర్తించారు. ఇటువంటి కిట్ ల ద్వారా మారుమూల కుగ్రామాల్లో, అంతగా అభివృద్ధి చెందని దేశాల్లో ఈ కిట్ ను ఉపయోగించచ్చు. సాంకేతికత వైద్య పరీక్షలను ఎంత సులభం చేస్తుందో కదూ. ఇక పై ఏ జబ్బుకైనా మనమంతట మనమే వ్యాధి నిర్ధారణ చేసుకునే కిట్ లు వస్తాయేమో వేచి చూడాలి.

Source