కలర్ ఫోటో, రైటర్‌ పద్మభూషణ్‌ చిత్రాలతో సక్సెస్ అందుకున్న సుహాస్‌(Suhas) హీరోగా ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందాడు. వైవిధ్యమైన కాన్సెప్ట్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచారు. అదే సమయంలో సుహాస్‌ సినిమా అంటే కచ్చితంగా ఏదో బలమైన కథ ఉంటుందనే, కొత్త కంటెంట్‌ ఉంటుందనే నమ్మకాన్ని ఇచ్చాడు.

ఇప్పుడు అదే నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ మరో క్రేజీ మూవీ(Crazy Movie)తో రాబోతున్నారు. అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు` అనే సినిమా చేస్తున్నాడు సుహాస్‌. తాజాగా ఈ చిత్ర టైటిల్‌(Movie Title), ఫస్ట్ లుక్‌(First Look) ని విడుదల చేశారు. సుహాస్‌తో పాటు `పుష్ప` జగదీష్‌, గోపరాజు రమణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

బన్నీవారు, వెంకటేష్‌ మహా సమర్పణలో దుష్యంత్‌ కటికనేని(Dushyanth Katikanenin) దర్శకత్వం(Direction)లో ఈ సినిమా రూపొందుతుండగా, జీఏ2 పిక్చర్స్, ధీరజ్‌ మోగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతుంది.

`భలే భలే మగాడివోయ్`, `గీత గోవిందం`, `టాక్సీవాలా`, `ప్రతిరోజూ పండగే`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` , `18 పేజెస్` లాంటి హింట్‌ చిత్రాల తర్వాత జీఏ 2 పిక్చర్స్ బ్యానర్లో (GA 2 Pictures Banners ) వస్తున్న సినిమా `అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు(Ambajipeta Marriage Bandu)`.

ఈ సినిమా గురించి చిత్ర బృందం(Movie Unit) చెబుతూ, షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్‌ ప్రారంభించి `కలర్ ఫోటో(Color Photo)` మూవీ తో సాలిడ్ హిట్(Solid Hit) అందుకున్నాడు సుహాస్. కేవలం యూత్ కి నచ్చే కాన్సెప్ట్స్ బేస్డ్ సినిమాలు మాత్రమే కాకుండా, తాజాగా `రైటర్ పద్మభూషణ్` వంటి చిత్రం చేసి ఫ్యామిలీ ప్రేక్షకుల(Family Audience) కు కూడా దగ్గరయ్యాడు సుహాస్.

ప్రస్తుతం సుహాస్ హీరోగా చేస్తున్న `అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు` మూవీ ఇప్పుడు షూటింగ్(Shooting) పనులను ముగించుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేసే మల్లి అనే కుర్రాడిగా అలరించనున్నాడు సుహాస్. తాజాగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

రిలీజ్ చేసిన పోస్టర్ లో మల్లికార్జున సెలూన్ షాప్ ను చూపిస్తూ, సెలూన్ షాప్ ముందు ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ మెంబర్స్ ను రివీల్(Reveal) చేసారు. సుహాస్ పాటు గోపరాజు రమణ, పుష్ప ఫేమ్ జగదీశ్ డప్పులు, సన్నాయి తో పాటు పలురకమైన మంగళవాయిద్యాలతో ఈ పోస్టర్ లో కనిపిస్తున్నారు.

సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను త్వరలో ఆఫీషియల్(Offical) గా వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించగా, ఎడిటింగ్ పనులు కోదాటి పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు,