దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్(Banking) దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త(Good News) చెప్పింది.

భారీగా ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (SBI Job Notification) విడుదల చేసింది SBI. మొత్తం 665 ఖాళీల(665 Posts)ను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. స్పెషలిస్ట్ ఆఫీసర్(Specialist Officer) పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ(Application process) ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 20ని ఆఖరి తేదీ(Last date)గా నిర్ణయించారు. అర్హత(Qualified), ఆసక్తి(Interest) కలిగిన అభ్యర్థులు(Candidates) ఆ తేదీలోగా అప్లై(Apply) చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్(Online) విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఖాళీల వివరాలు:

మొత్తం ఖాళీలు : 665

మేనేజర్ (బిజినెస్ ప్రాసెస్)              1

సెంట్రల్ ఆపరేషన్స్ టీమ్ – సపోర్ట్     2

మేనేజర్ (బిజినెస్ డెవలప్మెంట్)                   2

ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ బిజినెస్         2

రిలేషన్ షిప్ మేనేజర్                    335

ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్                   52

సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్                    147

రిలేషన్ షిప్ మేనేజర్ (టీమ్ లీడ్)     37

రీజినల్ హెడ్                               127

కస్టమర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్     75

విద్యార్హతల వివరాలు:

సంబంధిత స్పెషలైజేషన్లలో బీఈ(BE)/బీటెక్‌(B.TECH)/ఎంఈ(ME)/ఎంటెక్‌(M.TECH), ఎంబీఏ(MBA)/పీజీడీఎమ్‌(PGDM)/పీజీ డిగ్రీ(PG Degree)/ఐటీ(IT)) లేదా అందుకు సమానమైన విద్యార్హతలను కలిగి ఉండాలి.60 శాతం మార్కులను పొంది ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. అభ్యర్థులు ఇతర అనుభవం(Other Experience), తదితర పూర్తి వివరాల(Full Details)ను నోటిఫికేషన్లో చూడొచ్చు. అభ్యర్థుల వయస్సు(Age) 32 – 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎలా అప్లై చేయాలంటే:

  • అభ్యర్థులు మొదటగా ఈ లింక్ (https://recruitment.bank.sbi/crpd-sco-2022-23-16/apply) ఓపెన్ చేయాలి.
  • తరువాత న్యూ రిజిస్ట్రేషన్(New Registration) ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో సూచించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది
  • వివరాల నమోదు తర్వాత సబ్మిట్(Submit) పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్(Application Form) ప్రింట్(Print) తీసుకోవాలి.