పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్(Prabhas) , హీరోయిన్ పూజ హెగ్డే(Pooja Hegde) నటించిన రొమాంటిక్ ఫిల్మ్(Romantic Film) ‘రాధే శ్యామ్’(Radhe Shyam).

భారీ బడ్జెట్(Huge Budget) తో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 11న(March 11th) ప్రపంచ వ్యాప్తంగా(World wide) రిలీజ్ అయ్యింది.

భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను పొందింది. కానీ.. రూ.350 కోట్ల(350 Crores)తో నిర్మించిన రాధే శ్యామ్ బాక్సాఫీస్(Box office) వద్ద కలెక్షన్ల(Collections)లో కొంత వెనకబడిదనే చెప్పాలి. ఇప్పటి వరకు బాక్సాఫీస్ అందించిన రిపోర్ట్ ప్రకారం రూ.214కోట్ల గ్రాస్ ను  మాత్రమే రాధే శ్యామ్ దక్కించుందని తెలుస్తోంది.

అయితే, ప్రభాస్ అభిమానులు  మాత్రం ‘రాధే శ్యామ్’ను ఆదరిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ సినిమాల పట్ల ఆసక్తి ఉన్న ఆడియన్స్ రాధే శ్యామ్ ఓటీటీ విడుదల  కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ సంస్థ  అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా (Amazon Prime Video In) ప్రభాస్ బ్లాక్ బస్టర్ ‘రాధే శ్యామ్’ డిజిటల్ గ్లోబల్(Digital Global) ప్రీమియర్‌(Premiere)ను ప్రకటించింది.

ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లోని అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) యూజర్ల(Users)కు రాధే శ్యామ్ అందుబాటులోకి రానుంది.  ఏప్రిల్ 1 నుండి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో రాధే శ్యామ్ డిజిటల్ ప్రీమియర్‌ను  ప్రసారం చేయనున్నారు.

రాధా కృష్ణ కుమార్(Radha Krishna) దర్శకత్వం(Direction) వహించిన ఈ చిత్రాన్ని, గోపి కృష్ణ మూవీస్(Gopi Krishna Movies) సమర్పణలో UV క్రియేషన్స్(UV Creations) నిర్మించింది.

ఈ రొమాన్స్ డ్రామా(Romance Drama)లో ప్రభాస్, పూజా హెగ్డే ముఖ్య పాత్రలో నటించారు. సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి పులికొండ, భాగ్యశ్రీ, జగపతి బాబు, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, రిద్ధి కుమార్, సాషా చెత్రి, సత్యన్ తదితరులు కీలక పాత్ర(Main Roles)ల్లో నటించారు.