బిగ్ బాస్ సీజన్ 5 (Big Boss season 5) ఐదోవారం ఆట మంచి రసవత్తరంగా దూసుకుపోతోంది. కెప్టెన్ పోటీదారుల  కెప్టెన్సీ టాస్క్ ‘రాజ్యానికి ఒక్కరే రాజు’ టాస్క్‌ లో యాంకర్ రవి, సన్నీలు నువ్వా నేనా అని పోటీపడ్డారు.

ఇంట్లో హౌస్ మేట్స్ మాత్రం కాయిన్స్ దొంగలించి గేమ్ ని ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లారు. ఎక్కువ మంది హౌస్ మేట్స్(House mates) సప్పోర్ట్  ఎవరికి ఉంటే అతనే రాజ్యానికి రాజు అయ్యే  ఛాన్స్ ఉంటుంది.

చివరికి ఈ టాస్క్‌ లో ఎవరు గెలుస్తారో? మరి ఈ వారం కెప్టెన్ ఎవరో? ఇక నిన్నటి ప్రోమోలో పింకీ కి  బిగ్ బాస్ బర్త్ డే సర్ప్రైజ్ ఏమి ఇచ్చాడో?  గురువారం 33వ ఎపిసోడ్ లో  తెలుసుకుందాం.

కెప్టెన్సీ టాస్క్‌(Captaincy Task) లో సన్నీ టీంలో ఉన్న లోబో, యాంకర్ రవి టీంలోకి జంప్ అయ్యాడు. అయితే టాస్క్ టైం ముగియడంతో.. నాణేలను రేపు లెక్కిస్తాం అని తెలిపిన బిగ్ బాస్.

ఆ తరువాత ప్రియాంక సింగ్‌కు లైఫ్ లో గుర్తుండిపోయేలా సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. అతను ఆమెగా మారిన విషయాన్ని తండ్రి ఒప్పుకున్నట్టువీడియో ద్వారా చూపించాడు.

అబ్బాయైనా, అమ్మాయైనా సర్వం నువ్వే నాకు, నువ్వు అనుకుంది సాధించాకే ఇంటికి రావాలి. నువ్వు అమ్మాయిగా మారావని ఆదరించడం మానేస్తాం అని ఎప్పుడూ అనుకోకు’ అంటూ తల్లిదండ్రులు మాట్లాడిన వీడియో చూపించడంతో ఆమె బాగా ఎమోషనల్‌(Emotional) అయింది.

అంతే కాకుండా బిగ్‌బాస్‌(Big boss) ఆమెకు చీర, గాజులు, పూలు, స్వీట్లు పంపించాడు. ప్రియాంక తన ప్రతి పుట్టిన రోజుకు తన తమ్ముడు పంపిస్తాడు అని చెప్తుంది.

బిగ్ బాస్ పంపిన చీర, గాజులు, బొట్టు, పూలతో హౌస్ మేట్స్(House mates) అలంకరిస్తారు. మగువా మగువా అంటూ శ్రీ రామ్ పాట పాడాడు. తరువాత  హమీదా ఎమోషనల్ అవుతుంది దింతో  శ్రీరామ్ హామిదని హగ్ చేసుకుని ఓదార్చాడు.

కాజల్, సిరి తన టీంలో ఉంటూ నీ కోసం పని చేసారని, తన తో డీల్ సెట్ చేసుకున్నారని సన్నీ తో చెప్పకనే చెప్పాడు. ఇక రెండు రాజ్యాలకు రాజులుగా ఉన్న సన్నీ, రవిల దగ్గర నాణేలను ముందు లెక్కించారు.

సన్నీ దగ్గర 30 నాణేలు ఉండగా.. అతని రాజ్యంలోని సభ్యులు మానస్ దగ్గర 240 నాణేలు, షణ్ముక్ దగ్గర 220, జస్వంత్ దగ్గర 209 నాణేలు ఉన్నాయి.

అలాగే రవి దగ్గర 50 నాణేలు ఉండగా యాని  మాస్టర్ 176 నాణేలు, హమీదా దగ్గర 60 నాణేలు, విశ్వ 10, శ్రీరామ్ దగ్గర 50 నాణేలు, ప్రియ దగ్గర జీరో నాణేలు ఉన్నాయని బిగ్ బాస్‌కు  లెక్క చెప్పాడు శ్రీరామ్.

సన్నీ దగ్గర ఆరుగురు షణ్ముఖ్, మానస్, జెస్సీ, ప్రియాంక,  కాజల్‌,సిరిలు ఉండగా, రవి దగ్గర ఏడుగురు విశ్వ, లోబో, శ్రీరామ్, హమీదా,  ప్రియ, శ్వేత, యాని లు ఉన్నారు. దీంతో ఎక్కువ ప్రజలు కలిగిన రాజుగా యాంకర్ రవి గెలిచాడు.

దీంతో మొదటి కెప్టెన్ పోటీదారుడిగా అర్హత పొందాడు. ఆ తరువాత రవికి పట్టాభిషేకం నిర్వహించాలని బిగ్ బాస్ (Big boss)ఆదేశించాడు.

రవి, షణ్ముఖ్‌ ఒకరిఒక్కరు ఎదురుపడగా నేనంటే నీకు అంత కోపం ఎందుకురా అని అడుగుతాడు. నాతో మాట్లాడరా అని షణ్ముఖ్‌తో అన్నాడు రవి.నాకు కోపం ఎందుకు? అని సీరియస్‌గానే ఆన్సర్ ఇచ్చాడు షణ్ముఖ్.

షన్ను సరిగా మాట్లాడట్లేదని ఫీలవుతూ విశ్వ తో అంటాడు అయితే ఏంటి మీ తమ్ముడు షణ్ముఖ్‌ని గేట్ బయటపెట్టు అని సలహా ఇచ్చాడు విశ్వ. ఇక రవి కి సపోర్ట్ చేసి రాజుగా గెలిపించిన ముగ్గురిని సమానంగా ధనాన్ని పంచి ఎవరు కెప్టెన్సీ(Captaincy) పోటీదారులో తెలుపమని అధిషించాడు బిగ్ బాస్(Big boss).

దీంతో రవి.. యానీ మాస్టర్‌, హమీదా, శ్వేతను పోటీదారులుగా పేర్కొన్నాడు. అయితే  బిగ్‌బాస్‌ హౌస్మ మేట్స్(House mates) కి మరో ట్విస్ట్  ఇచ్చాడు.

ఈ సీజన్‌ మొత్తానికి కెప్టెన్‌(Captain) అయ్యే అర్హతను కోల్పోయిన ప్రియకు కెప్టెన్‌ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. అంతేకాకుండా ఆమె కెప్టెన్‌గా గెలిస్తే ఈ సీజన్‌లో అందరిలాగే కెప్టెన్‌గా పోటీచేసే అర్హత తిరిగి లభిస్తుందని చెప్పాడు.

దీంతో కెప్టెన్సీ కంటెండర్స్‌ పోటీ నుంచి తప్పుకుని, తన స్థానాన్ని ప్రియకు ఇచ్చిన హమీద . అనంతరం బిగ్‌బాస్‌ ‘పదివేలు సరిపోవు సోదరా’ అనే కెప్టెన్సీ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా కొన్ని రంధ్రాలున్న వాటర్‌ ట్యాంకులను గార్డెన్‌ ఏరియాలో ఏర్పాటు చేశాడు.

టాస్క్‌ ముగిసే సమయానికి ఎవరి దగ్గరున్న వాటర​ ట్యాంకులో ఎక్కువ నీళ్లుంటాయి వారే గెలిచినట్టు అని క్లారిటీ ఇచ్చాడు.

ఈ టాస్క్ కి సంచలకుడిగా షన్ను వ్యవహరిస్తాడని చూపిన బిగ్ బాస్(Big boss) ఈ టాస్కులో రవి, యానీ మాస్టర్‌, శ్వేత, ప్రియ పోటీ పడ్డారు.

మరి ఈ టాస్క్ ఎవరు గెలిచారో ఈ వారం కెప్టెన్ అయ్యారో తెలియాలంటే రేపటి దాక వెయిట్ చేయాల్సిందే, అయితే ఈ టాస్క్ లో ప్రియా నే విజేతగా నిలుస్తుందేమో అని అనిపిస్తోంది . మరి మీకు?