చెత్త. ఇది ఎన్నో రకాలు. మన ఇళ్ళ నుంచి, పరిశ్రమల నుంచి, వ్యవసాయం ఇలా ఎన్నో రంగాల్లో నిత్యం చెత్త ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. వీటితో ప్రమాదo లేదు కానీ వీటన్నిటినీ మించి ప్రమాదకరమైన చెత్త మరొకటి ఉంది. అదే న్యూక్లియర్ వేస్ట్ (nuclear waste). మన దేశం లోని న్యూక్లియర్ రియాక్టర్ల నుండి విడుదలయ్యే చెత్త. దీన్ని అత్యంత జాగ్రత్తగా శుద్ధి చేయాలి. ఈ న్యూక్లియర్ రియాక్టర్ల లో ప్రధాన ఇంధనం యురేనియం (Uranium). ప్రతీ టన్ను యురేనియంకు 500 లీటర్ల న్యూక్లియర్ చెత్త తయారవుతుంది. ఇప్పటిదాకా దీన్ని దేనికోసమూ ఉపయోగించింది లేదు. కానీ ఇప్పుడు Baba Atomic Research Centre కు చెందిన శాస్త్రవేత్తలు K. బెనర్జీ మరియు C.P. కౌశిక్ ఈ చెత్త నుండి ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా Caesium-137 ను తయారు చేసారు. ఈ Caesium-137 ను గాజు మాధ్యమంలో (glass medium) లో నింపి pencils గా తయారు చేస్తారు. ఈ pencils ను 30 సంవత్సరాల వరకూ ఉపయోగించచ్చు. అయితే దీన్ని ప్రత్యేకమైన శిక్షణ కలిగిన సిబ్బంది మాత్రమే ఉపయోగించాలి. ఇక ఈ Caesium-137 ద్వారా ఎన్నో ఉపయోగాలున్నాయి.

Gangas Cleaning

ఈ Caesium-137 pencils నుంచి వచ్చే beta, gamma కిరణాలు వైద్య రంగంలో ఉపయోగిస్తారు. ఇది దాతల రక్తాన్ని sterilise చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే safe blood transfusion ప్రక్రియలో దాత రక్తాన్ని రోగికి ఎక్కించేటప్పుడు దాత రక్తంలోని WBC (White blood cells) ఉండకూడదు. ఈ Caesium-137 తో sterilise చేయడం వల్ల ఇది ఆ రక్తంలో లో WBC లేకుండా చేయగలదు. ఇప్పటి దాకా ఇందుకోసం Cobalt-60 ని ఉపయోగించేవారు. ఇది ఖరీదైనది కావడం వల్ల ఆ స్థానాన్ని ఈ Caesium-137 భర్తీ చేయగలదు.

Gangas CleaningGangas Cleaning

అలాగే ఈ Caesium-137 pencils తో మున్సిపల్ వేస్ట్ ను శుద్ధి చేయగలదు. దీని నుంచి వచ్చే న్యూక్లియర్ రేడియేషన్ వల్ల చెత్త లోని బాక్టీరియా నశిస్తుంది. అందువల్లనే దీనిని ఇప్పటికే ఎంతో కలుషితమైన గంగా (gangas) నదిని శుభ్రం చెయడo కోసం ఈ Caesium-137 ను ఉపయోగించనున్నారు. ఇందుకోసం BARC, Ahmedabad muncipal Corporation తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ గంగా నదీ ప్రక్షాళన కోసం BARC ఎక్కువ మొత్తం లో ఈ Caesium-137 ను ఉత్పత్తి చేయనుంది. న్యూక్లియర్ వేస్ట్ నుంచి Caesium-137 ను తయారు చేసిన పద్ధతిని International Atomic Energy Agency (IAEA) సైతం ప్రశంసిoచింది.

ఇది కార్యరూపం దాల్చితే అందరి పాపాలనూ ప్రక్షాళన చేయగల గంగను ప్రక్షాళన చేసిన ఘనత ప్రపంచంలో మనకే దక్కుతుంది.

courtesy

images