ఎండాకాలం(Summer Season)లో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. లేకపోతే శరీరంలోని నీటిశాతం(Water percentage) తక్కువై త్వరగా అలసిపోయి.. వడదెబ్బ(Sunstroke) తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందుకు తగ్గట్లుగా ఆహారం తీసుకోవాలి.

నీటిని ఎక్కువగా తీసుకోవాలి. అదే విధంగా. సగ్గుబియ్యం(Sabudana)ని డైట్‌(Diet)లో చేర్చుకోవాలి. సగ్గుబియ్యం ఒక్క వెజిటేరియన్(Vegetarian) ప్రొసెస్డ్ ఫుడ్(Processed food). సాగొ అనే పేరుతో ప్రాచుర్యం పొందిన సగ్గుబియ్యం కర్ర పెండలం నుండి తీసుకోబడిన పొడి నుండి తయారుచేయబడుతుంది.

ఛౌవ్వరి(Chovvari), సగుదనా(Sagudana), అవ్వరిషి(Avvarishi) గా సగ్గుబియ్యం ప్రసిద్ది. మరి సగ్గుబియ్యం తో రుచికరమైన రెసిపీస్(Tasty recipe) నేర్చుకుందాం!

కావాల్సిన పదార్థాలు:

సబుదాన లేదా సగ్గుబీయం – ఒక కప్పు

ఉడకబెట్టిన బంగాళదుంప – 1

పచ్చి మిర్చి  – 2

ఉప్పు – తగినంత

అల్లం – తగినంత

కరివేపాకు – ఒక రెమ్మ

జీలకర్ర – ½ టీ స్పూన్

వేరుశెనగ – ½ కప్పు

నెయ్యి – 2 టీ స్పూన్లు

తయారు చేయు విధానం:

ఒక కప్పు సగ్గుబియ్యాన్ని నీటిలో సుమారు 2 3 గంటలు నానబెట్టండి. పాన్ వేడి చేసి వేరుశెనగలను వేయించి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.

పాన్ వేడి చేసి 2 స్పూన్ల నెయ్యి వేయాలి. జీరా, తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలపాలి. వాటిని ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించి, ఆపై ఉడికించిన మరియు తరిగిన బంగాళాదుంపలను వేసి బాగా వేయించాలి. బంగాళదుంపలు బాగా వేగిన తర్వాత – బాణలిలో నానబెట్టిన సగ్గుబియ్యం వేయాలి. బాగా వేగించండి.

తరువాత మెత్తగా రుబ్బుకున్న శనగ పొడిని జోడించండి. చివరగా రుచికి సరిపడా ఉప్పు వేసి ఖిచిడీని కలుపుతూ ఉండండి. కిచిడీని కలపడం ఆపితే జిగటగా మారుతుంది.  రుచికరమైన సగ్గుబియ్యం ఖిచిడి వేడిగా సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది.

ప్రయోజనాలు:

సగ్గుబియ్యం(Sabudana)లో శరీరానికి కావాల్సిన ఖనిజాలన్నీ(Minerals) ఉన్నాయి. ఎంతగా అంటే.. ఎలక్ట్రోలైట్స్(Electrolytes) అని మనం తీసుకునే ఖనిజాలన్నీ కూడా సగ్గుబియ్యంలో మనకి కనిపిస్తాయి. పొటాషియం(Potassium), కాల్షియం(Calcium), మెగ్నీషియం(Magnesium), ఫాస్పరస్(Phosphorus), ఇనుము(Iron) వంటి ఖనిజాలన్నీ ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఇవి ఎముకలని(Bones) దృఢంగా(Strong) ఉంచడుతాయి. కండరాలకి శక్తిని అందిస్తాయి. నీరసంగా ఉండేవారు, ఆరోగ్య సమస్యలున్న ఉన్నవారు సగ్గుబియ్యం జావ తాగితే ఎంతో ఉపశమనంగా ఉంటుంది వ్యాయామం తరువాత  సగ్గుబియ్యాన్ని తీసుకుంటే అలసిన శరీరానికి అదనపు శక్తి(Extra Power) లభిస్తుంది.

దీనివల్ల అలసట(Tiredness) దూరమవుతుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు (Digestive Problems)తగ్గుతాయి. విరేచనాలు(Diaharrea), పొట్ట ఉబ్బరం(stomach upset), అజీర్ణం, మలబద్ధకం(Constipation), అసిడిటీ(Acidity) సమస్యలు తగ్గాలంటే వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటుండాలి.