జామపండ్ల(Guava Fruits)తో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఉన్నాయో జామ ఆకుల(Guava Leaves)తోనూ చాలా ఉన్నాయి.

జామ ఆకులతో టీ(Tea) తయారుచేస్తారని తెలుసా. జామకాయలు, ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ c(Vitamin C), పొటాషియం(Potassium), ఫైబర్(Fiber) లభిస్తాయి. అందుకే మనం జామకాయల్ని తినాలి, ఆకుల రసం తాగాలి.

జామపండ్లను తింటే జలుబు వస్తుందని పెద్దవాళ్లు అంటుంటారు. అందువల్ల మరీ బాగా ముగ్గినవి కాకుండా దోరగా ఉన్నవి తింటే మేలు. జామకాయలు మన దేశంలో కంటే మధ్య అమెరికాలో ఎక్కువగా కాస్తాయి. అక్కడి నుంచే ఈ చెట్లు ప్రపంచమంతా విస్తరించాయి.

ఎండ వాతావరణంలోనే పెరిగే ఈ కాయలు ఏడాదంతా కాస్తూనే ఉండటం మనకు కలిసొచ్చే అంశం. మరి జామకాయల ఆకులతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

జామ పండ్ల ఆకుల రసం తాగితే మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్(Blood Sugar Levels) క్రమపద్ధతికి చేరతాయి. చాలా ఎక్కువసేపు బ్లడ్ షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది. డయాబెటిస్(Diabetes) ఉండేవారికి ఇది ఎంతో మేలు చేసే అంశం.

అందువల్ల భోజనం తర్వాత జామ ఆకుల టీ తాగితే కలిసొస్తుంది. దాదాపు రెండు గంటలపాటూ బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. ఓ నాలుగు జామ ఆకుల్ని నీటిలో పది నిమిషాలు ఉడికించి, ఆ నీటిని తాగేయడమే. ఈ నీరు రుచిగా ఉండకపోయినా ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇలాగే తాగేయడం మేలు.

మార్కెట్లలో జామ ఆకుల టీ ప్యాకెట్లు లభిస్తున్నాయి. జామ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, విషవ్యర్థాలను చంపేసి, గుండె(Heart)కు మేలు చేస్తాయి. జామకాయల్లోని పొటాషియం, కరిగిపోయే ఫైబర్ గుండెను కాపాడతాయి. జామ ఆకులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.

హైబీపీ(High BP), చెడు కొలెస్ట్రాల్ వంటివి గుండె జబ్బులకు కారణమవుతాయి. అందువల్ల జామ ఆకుల రసం తాగాలి.

పీరియడ్స్ టైమ్‌లో చాలా మంది మహిళలు పొట్టలో నొప్పి వస్తున్నట్లు బాధపడతారు. జామ ఆకుల రసం ఈ నొప్పులను అదుపుచేస్తుంది. రోజూ ఈ రసం తీసుకుంటే మేలు జరుగుతుంది.

జామకాయలు జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తాయి. ఎంత ఎక్కువగా జామకాయలు తింటే అంతగా జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకం పారిపోతుంది. ఒక జామకాయ మన రోజువారీ అవసరమయ్యే ఫైబర్‌‌లో 12 శాతం ఇస్తుంది. జామ ఆకుల రసం కూడా జీర్ణక్రియ(Digestive System)ను మెరుగుపరుస్తుంది(Improves).

డయేరియా (విరేచనాలు)కి చెక్ పెడుతుంది. జామకాయల్లో కేలరీలు తక్కువ. అందువల్ల ఇవి తింటే ఆకలి తీరుతుంది. అలాగే ఎక్కువ కేలరీలు(Calories) బాడీకి చేరవు. పైగా వీటిలోని విటమిన్లు, మినరల్సూ మేలు చేస్తాయి.

కాన్సర్(Cancer) వస్తే దాన్ని వదిలించుకోవడం ఓ సాహసమే. అసలు కాన్సరే రాకుండా చేసుకుంటే బెటర్ కదా. జామ ఆకుల్లో కాన్సర్‌ను నిరోధించే గుణాలున్నాయి. కాన్సర్ కణాల సంఖ్య పెరగకుండా కూడా ఇది చేస్తుంది.

కణాలను కాపాడుతుంది. కాన్సర్ మందుల కంటే జామ రసం నాలుగు రెట్లు ఎక్కువగా ప్రభావం చూపించగలదని పరిశోధనల్లో తేలింది. ఆకుల్లో విటమిన్ సీ ఉంటుంది. ఇది వ్యాధులు(Diseases), ఇన్ఫెక్షన్ల(Infections)తో పోరాడుతుంది. ఓ ఆరెంజ్ తింటే వచ్చే సీ విటమిన్ కంటే డబుల్ సీ విటమిన్ జామకాయను తింటే వస్తుంది.

బాడీకి వ్యాధులు రాకుండా ఉండాలంటే సైలెంట్‌గా జామకాయలు తినేస్తూ ఉండాలి. మనకు వేడి చేసినప్పుడు విటమిన్ సీ బాడీ లోంచీ వెళ్లిపోతుంది. దాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే జామకాయలు తినేయాలి. జామకాయ నిండా పోషకాలే(Nutrition’s). పైగా ఫైబర్ కూడా ఉంటుంది.

తింటే మంచి ఆహారం తిన్నట్టే. జామ ఆకులు కూడా అంతే. చర్మానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి. బయటి కాలుష్యం(Pollution) వల్ల మన చర్మం(Skin) పాడైపోతుంది. అడ్డమైన మచ్చలు(Marks), కణతులు, ఏవేవో వస్తుంటాయి చాలా మందికి.

వాళ్లు జామకాయలు తింటూ జామ ఆకుల రసం తాగేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా స్కిన్ నయమవుతుంది. చర్మం ముడతలు(Wrinkles) పడకుండా జామకాయ కాపాడుతుంది.