మనలో చాలా మందికి పెట్టిన వస్తువులు ఎక్కడ పెట్టామో గుర్తు వుండదు. దానికి మతిమరపో లేదా ఏదైనా ఒత్తిడి లో వుండి మర్చిపోవడం సహజమే. అలా మనం మర్చిపోయే వస్తువులు ఎక్కువగా తాళాలు ఇంకా సెల్ ఫోన్. వీటిని ఎక్కడ పెట్టామా అని ఆడ వాళ్ళైతే హ్యాండ్ బాగుల్లోనూ మగ వాళ్ళైతే జేబుల్లోనూ వెతుక్కోవడం మన కంట చాలా సార్లు పడి వుంటుంది. ఇక పై అలా వెతుక్కోవలసిన అవసరం లేదు. అందుకోసం వచ్చేసింది GoKeys. దీని గురించి, దీని ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.

Gokey Gokey

ఇది స్టీలుతో చేసిన ఒక పరికరం. ఇది ఒక చిన్న తాళం చెవి ఆకారంలో వుంటుంది. ఇది చాలా రకాలుగా పని చేస్తుంది. దీనిలో జిపిఎస్, యుఎస్బి కేబుల్, ఫ్లాష్ డ్రైవ్, ఫోన్ చార్జర్ ఇలా ఎన్నో వున్నాయి. సాధారణ కీ చెయిన్ లాగ దీనికి మన తాళాలను తగిలించుకోవచ్చు. అలాగే దీనిలోని డ్రైవ్ కు మన కంప్యూటర్ నుంచి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసి, అలాగే దీని నుంచి రిసీవ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఇది 8, 12, 32GB కెపాసిటీ లలో దొరుకుతుంది. దీనిని ఫోనుకు కనెక్ట్ చేసుకుంటే మన ఫోను ఛార్జింగ్ ను రెండు గంటలు పెంచుతుంది. ఇక ఈ GoKey ని యుఎస్బి కేబుల్ ద్వారా కంప్యూటర్ కు కనెక్ట్ చేస్తే ఈ పరికరం ఛార్జ్ అవడం తో పాటు మన ఫోనును కూడా ఛార్జ్ చేస్తుంది. ఇక దీనిని మన ఫోనుకు రిమోట్ లాగ కూడా వాడుకోవచ్చు. దీనిని యాప్ ద్వారా ఫోనుకు అనుసంధానం చేసుకుంటే మన మ్యూజిక్ ను ప్లే, పాజ్, స్కిప్ చేసుకోవచ్చు. దీనికి తాళాలను తగిలించి ఎక్కడైనా మర్చిపోతే, బ్లూటూత్ ద్వారా మీ ఫోనులోని ఈ యప్ (App) కు వెళితే అది మీరు మీ తాళాలకు ఎంత దగ్గరలో వున్నారో చూపిస్తుంది. ఇక దగ్గరకొచ్చిన తరువాత ఈ యాప్ లోని బటన్ నొక్కితే ఈ పరికరం చేసే శబ్దం ద్వారా మీ తాళాలు ఎక్కడ వున్నాయో కని పెట్టవచ్చు.

Gokey Gokey

అలాగే ఈ కీ మీ చేతిలో వుండి మీరు సెల్ ఫోనును ఎక్కడైనా మర్చిపోతే ఈ GoKey ని ఒక్కసారి నొక్కితే చాలు మీ ఫోన్ సైలెంట్ లో ఉన్నాసరే ఈ యాప్ శబ్దం చేయడం ద్వారా మీ ఫోనును కనిపెట్టవచ్చు. ఒక వేళ మీ తాళాలు చాలా దూరంలో వుంటే, ఉదాహరణకు 100 అడుగుల కన్నా దూరం లో ఉంటే ఈ పరికరం లోని జిపిఎస్ ద్వారా ఎక్కడుందో తెలిసిపోతుంది.

Gokey Gokey Gokey

ఇది అందరికీ ఎంతో ఉపయోగపడే పరికరం. ఇంతటి అద్భతమైన GoKeys ఈ ఏడాది చివరికల్లా మార్కెట్ లోకి రానున్నాయి.

Courtesy