మన చర్మం(Skin) అందం(Beauty)గా, ఆరోగ్యం(Health)గా ఉండాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాము. అందంగా, ఆరోగ్యంగా కనిపించాలని మనం చర్మానికి రకరకాల ఫెయిర్నెస్ క్రీములు(Fairness Cream), లోషన్ లు(Lotions) వాడుతుంటాం. కానీ వీటివల్ల వచ్చే అందం తాత్కాలికం మాత్రమే.

చర్మం మరింత అందంగా, ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన ఆహారపు శైలి(Food style) అలవాటు చేసుకోవాలి. కొన్ని ఆహార పదార్థాలు మన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!

బొప్పాయి: బొప్పాయి(Papaya) పండులో యాంటీ ఆక్సిడెంట్లు(Anti-Oxidants) ఎక్కువగా ఉంటాయి. బొప్పాయి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. బొప్పాయి గుజ్జు(Pulp)ను ముఖంపై రాసుకుంటే చర్మం మెరిసిపోతుంది.

క్యారెట్: క్యారెట్(Carrot) లో విటమిన్ సి(Vitamin C) అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే బీటా కెరొటిన్(Beta Keratin) చర్మాన్ని, కంటిచూపు(Eye sight)ను మెరుగుపరుస్తుంది. కనుక అందమైన చర్మం కోసం రోజు ఆహార పదార్థాలలో తీసుకోవడం తప్పనిసరి.

దోసకాయ: దోసకాయ(Cucumber)లో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. దోసకాయ గుజ్జు ముఖం పై ఉన్న నల్ల మచ్చలను తొలగిస్తుంది.

బ్లూ బెర్రీస్: ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ కణాలు ఆక్సిజన్(Oxygen) ను ఉపయోగించుకున్న తరవాత విసర్జించిన ఫ్రీరాడికల్స్(Pre-radicals) వల్ల కలిగే హానిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. బ్లూబెర్రీ(Blueberry), స్ట్రాబెరీ(Strawberry) వంటి పండ్లను తీసుకొనుట వలన చర్మపు ముడతల(Skin wrinkles)ను తగ్గిస్తాయి.

ఆరెంజ్: ఆరెంజ్(Orange) లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ సి చర్మానికి మంచి మెరుగును అందిస్తుంది. ఒంట్లో నీరసాన్ని తగ్గిస్తుంది. దీనికి తొక్కను చర్మానికి రాసుకోవడం వల్ల మంచి నిగారింపు వస్తుంది.

పాలకూర: పాలకూర(Spinach)లో ఉన్న విటమిన్ బీటా కెరోటిన్ లు వయసు ఛాయలు కాకుండా చర్మాన్ని కాపాడుతాయి. దీనిని రోజూ ఆహారంలో తీసుకుంటే 40  వయసులో కూడా చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.

సరైన ఆహారం తీసుకోవడంతో పాటు మంచి నీటిని కూడా సేవించడం మంచిది. రోజుకు మూడు లీటర్ల మంచి నీటి(Water)ని తీసుకొనుట వలన శరీరంలోని వ్యర్థాలు(waste) బయటకు వెళ్లి ,చర్మానికి కావాల్సిన తేమ(Wet)ను అందిస్తాయి.