సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్‌) పలు ఉద్యోగాలకు నోటికికేషన్(Notification) విడుదల(Release) చేసింది. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి అర్హులైన(Qualified) పురుష(Men), మహిళా(Women) అభ్యర్థుల (Candidates)నుంచి ఆన్‌లైన్(Online) దరఖాస్తుల(Applications)కు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 540 పోస్టులను భర్తీ చేయనుంది.

ఈ పోస్టులకు సంబంధించి సెప్టెంబర్‌ 26 నుంచి దరఖాస్తు ప్రక్రియ(Process) మొదలవుతుంది. అక్టోబర్‌ 25 దరఖాస్తులకు ఆఖరు తేదీ(Last Date). అర్హత, ఆసక్తి వున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి పూర్తి వివరాలకు(Full Details) https://cisfrectt.in/ వెబ్‌సైట్‌(Website) చూడొచ్చు.

ముఖ్య సమాచారం:

మొత్తం ఖాళీల సంఖ్య: 540

అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(ASI) (స్టెనోగ్రాఫర్)- 122 పోస్టులు (పురుషులు- 94, మహిళలు- 10, డిపార్ట్‌మెంటల్- 18)

హెడ్ కానిస్టేబుల్(HC) (మినిస్టీరియల్)- 418 పోస్టులు (పురుషులు- 319, మహిళలు- 36, డిపార్ట్‌మెంటల్- 63)

అర్హత: ఇంటర్మీడియట్(Inter) లేదా సీనియర్ సెకండరీ స్కూల్(Senior Secondary School) (10+2) సర్టిఫికేట్ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు ఏఎస్‌ఐ పోస్టులకు రూ.29200-92300, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రూ.25500-81100 ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(Physical Standard Test), డాక్యుమెంటేషన్(Documentation), రాత పరీక్ష(Written Exam)/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT), స్కిల్ టెస్ట్(Skill Test), మెడికల్ ఎగ్జామినేషన్(Medical Exam) ఆధారంగా ఎంపిక(Selection) చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు(Exemption) ఉంది).

దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్‌ 26, 2022

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 25, 2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://cisfrectt.in/