మన శరీర నిర్మాణం(Body Structure) మొత్తం ఎముకల(Bones) పైనే ఆధారపడి ఉంటుంది. ఎముకలు బలహీనమైన(Bone Weakness), వ్యాధులకు(Diseases) గురయిన మన రోజు వారి పనులు సైతం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. వయసు పెరుగుతునపుడు ఎముకలు బలహినమై ఏ చిన్న దెబ్బ తగిలిన, లేదంటే కింద పడిన విరుగుతూ ఉంటాయి.

వయసుతో సంబంధం లేకుండా ఆట్లాడుతున్నపుడు(Playing) లేదా ఆక్సిడెంట్(Accidents) లకు గురైనపుడు ఎముక విరగ వచ్చు విరిగిన ఎముక(Broken Bone) కు చికిత్స తీసుకున్న తరువాత ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు(Precautions) తీసుకుంటే మరింత త్వరగా కొత్త ఎముక ఏర్పడి విరిగిన ఎముక యదాస్థితికి చేరడానికి అవకాశం ఉంటుంది. అలంటి ఆహారం గురించి ఇక్కడ తెలుసుకుందాం!

ఎముకలు ఆరోగ్యం(Bone Health)గా చురుకు(Active)గా ఉంటేనే మన జీవితం(life) చురుకుగా ఉంటుంది. సాధారణంగా ఎముకను బలంగా ధృడం(Strong)గా ఉంటాయి. అందుకే అవి అంత తేలికగా విరగవు, ఒకవేళా విరిగిన మనం ఊహించిన దానికన్నా వేగంగానే తిరిగి యధాస్థితికి చేరుకునే అవకాశం వుంది. అయితే ఆలా కొత్త ఎముక నిర్మాణం జరగాలంటే ఫ్రాక్చర్(Fracture) తరువాత మనం తీసుకునే ఆహారంలో తగ్గిన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఎముక విరిగినప్పుడు

డాక్టర్ సలహా(Doctor Advice) ఇస్తే తప్ప పోషకాలు(Nutrients) వుండే టాబ్లెట్లను(Tablets) వాడకూడదు. వీటికంటే మంచి పోషకాహారం తీసుకోవడమే మేలు అందుకే ఎముక ఫ్రాక్చర్ అయినపుడు ప్రోటీన్(Protein) లు ఎక్కువగా వున్నా ఆహారం తీసుకోవాలి.అలాగే విరిగిన ఎముక అత్తుకునే సమయంలో కాల్షియమ్(Calcium) తీసుకోవటం చాలా అవసరం. ఎముక విరిగినపుడు విటమిన్ డి(Vitamin D) వున్న ఆహారం కూడా తప్పకుండా తీసుకోవాలి. విటమిన్ డి మనకు సూర్యుని కాంతి(Sun Light) ద్వారా లభిస్తుంది. ప్రతి రోజు ఒక్క పావు గంట(15 Mins) ఉదయపు ఎండ(Sunlight)లో నిలబడితే విటమిన్ డి లభిస్తుంది.

గుడ్లోని(Eggs) పచ్చ సొన, కొవ్వు వున్న చేపలు(Fatty Fishes) మొదలైన ఆహారంతో పాటు విటమిన్ డి కలిగిన పాలు(Milk), పెరుగు(Curd), ఆరంజ్ జ్యూస్(Orange Juice) ల్లో కూడా ఇది ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి కూడా ఎముకల నిర్మాణంపై చాలా అవసరం.ఎముక విరిగినప్పుడు విటమిన్ సి(Vitamin C) ఎక్కువగా వున్న ఆహారం కూడా తీసుకోవాలి. అలాగే ఐరన్(Iron), పొటాషియం(Potassium) ఎక్కువగా వున్న ఆహారం కూడా ఎముక పెరిగి, తిరిగి మాములు రూపంలోకి రావడానికి తోడ్పడతాయి.ఎముక ఫ్రాక్చర్ అయినపుడు, ఎముకలకు హానికి చేసే వాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఆల్కహాల్(Alcohol) సంబంధిత పానీయాల(Drinks)ను తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వలన విరిగిన ఎముక కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే ఎముక విరిగి కోలుకుంటున్న సమయంలో ఉప్పు ఎక్కువగా వున్న ఆహారం తీసుకోకూడదు. ఉప్పు ఎక్కువగా వున్న ఆహారం తీసుకుంటే మూత్రంలో కాల్షియమ్ ఎక్కువగా పోతుంది.

అలాగే ఎముక ఫ్రాక్చర్(Bone Fracture) అయిన వారు కాఫీ(coffee) కూడా ఎక్కువ గా తాగకూడదు. ఇలా తాగడం వలన మూత్రాని(Urine)కి ఎక్కువ సార్లు వెళ్లడం, దాని ద్వారా కాల్షియమ్ కోల్పోవడం జరుగుతుంది. ఆహారం అంటే ఆకలి(Hungry) తీర్చే సాధనం మాత్రమే అనే అభిప్రాయం ఇప్పుడు పోయింది. ఆహారం మన ఆరోగ్యం పైన ప్రభావం(Influence) చూపుతుందనే అవగాహనా పెరుగుతోంది.కొంత మంది పోషకారమే తింటున్నం కదా!

ఇంకా పర్వాలేదులే అనుకుంటారు, కానీ మనం వున్న పరిస్థితికి మన ఆరోగ్య స్థితికి(Health Condition) పోయే పోషకారాన్ని(Nutrition) ఎంపిక చేసుకుని తింటేనే అనారోగ్యాలను త్వరగా తగ్గించుకోవచ్చు , రాకుండానే నివారించుకోవచ్చు కూడా!