బుల్లితెర రియాలిటీ షో(Small Screen Reality Show)కి ఏంటో క్రేజ్ ఉందో  ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకున్న షో బిగ్ బాస్(Big Boss).

ఇప్పటికే ఐదు సీజన్లు సక్సెసఫుల్(Successful) గా  పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో తాజాగా ఈ షో ఓటీటీ వెర్షన్(OTT Version) కు సిద్ధమైంది.

తెలుగు, హిందీ, తమిళంలోనే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతీయ భాషల్లోనూ బిగ్‌బాస్‌ షో ప్రాసారమవుతుంది. అంతేకాదు ఈ ఓటీటీ షో కి ఎంపికైన కంటెస్టెంట్స్(Contestants) ఇప్పటికే వారందరిని క్యారంటైన్‌(Quarantine)కి కూడా తరలించారట.

ఈనెల 26 నుంచి ఈ షో స్ట్రీమింగ్(Streaming) కానుంది.  ఈ షో డిస్నీ+హాట్‌స్టార్‌(Disney+Hotstar)లో 24*7 ప్రసారం కానుంది.’బంపర్ ఆఫర్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ బిందు మాధవి (Bindhu Madhavi). ఈ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఈ బ్యూటీ .. ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది.

తెలుగు అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్(KollyWood) వైపు మళ్లింది. అక్కడ నటిగా గుర్తింపు తెచ్చుకున్న బిందు. తాజాగా తెలుగు బిగ్ బాస్ ఓటీటీ ద్వారా మళ్లీ కంబ్యాక్(Comeback) ఇవ్వడానికి సిద్ధమైంది.

తాజాగా బిందు మాధవి(Bindu Madavi)కి సంబంధించిన ఓ పోస్ట్ ను బిగ్ బాస్ ఓటీటీ (Telugu Big Boss OTT) మేకర్స్(Makers) ట్విట్టర్ (Twitter)ద్వారా వెల్లడించారు. ముఖం సరిగా కనిపించని ఓ ఫోటోను షేర్(Share) చేస్తూ.. ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టండి అంటూ క్విజ్(Quiz) పెట్టారు.

ఇందులో బిందు మాధవి స్పష్టంగా కనిపిస్తోందంటూ నెటిజన్స్ కామెంట్స్(Comments) చేస్తున్నారు. ఈ షోలో బిందు అదరగొడితే మళ్లీ తెలుగులో మంచి ఆఫర్స్(Offers) అందుకోవచ్చు.

ఇక మాధవితో పాటు ఈ షోలో కమెడియన్ ధనరాజ్ (సీజన్ 1 కంటెస్టెంట్),  ముమైత్ ఖాన్ (సీజన్ 1 కంటెస్టెంట్), ఆదర్శ్ (సీజన్ 1 రన్నర్), రోల్‌ రైడా (సీజన్ 2 కంటెస్టెంట్), తేజస్వి (సీజన్ 2 కంటెస్టెంట్),అషు రెడ్డి (సీజన్ 3 కంటెస్టెంట్), మహేశ్‌ విట్టా (సీజన్ 4 కంటెస్టెంట్), అరియానా గ్లోరి (సీజన్ 4 కంటెస్టెంట్), సరయు (సీజన్ 5 కంటెస్టెంట్), హమీదా (సీజన్ 5 కంటెస్టెంట్) నటరాజ్ మాస్టర్ (సీజన్ 5 కంటెస్టెంట్),యూట్యూబర్, యాంకర్ నిఖిల్ ,యాంకర్ స్రవంతి చొక్కారపు,ఆర్జే చైతు, యాంకర్ శివ , చిచ్చా చార్లెస్‌, అజయ్‌ కతుర్వార్‌, రోల్‌ రైడా పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరి వీరిలో ఎవరు అఫియల్‌ లిస్ట్(Official list) లో ఉంటారో తెలియాలంటే, ఫిబ్రవరి 26వరకు ఆగాల్సిందే.