స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది.

నాలుగు సీజన్స్ తో ప్రేక్షకులను అలరించిన బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్ అఫిషియల్ టైం అండ్ డేట్ (Big Boss Official Time and Date) ని ఖరారు చేసారు.

సరికొత్త సీజన్ తో సెప్టెంబర్ 5 (September 5) న బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ మా లో ప్రసారం కానుంది.

ఇప్పటికే బుల్లితెర ప్రేక్షకుల అంచనాలను మరింత రెట్టింపు చేస్తూ ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమోతో (Big Boss season 5 Promo) మన ముందుకు వచ్చేసారు హోస్ట్ నాగార్జున . ఇక తాజా ప్రోమోలో నాగార్జున స్టైలిష్‌ లుక్ (Stylish look) తో కనిపించారు. కానీ పెద్దగా మేకోవర్ అయితే కనిపించలేదు..

పైగా ప్రోమో కూడా కాన్సెప్ట్ బేస్డ్‌గా కాకుండా.. బిగ్ బాస్ వస్తుంది.. చూడండి అన్నట్టు గా ప్రోమో ఉంది.

సెప్టెంబర్ 5 సాయత్రం 6 గంటలకు బిగ్ బాస్ సీజన్ 5 మొదలు కానుంది. రాత్రి 10 గంటలకు, సోమవారం నుంచి శుక్రవారం వరకూ, అలాగే శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు (Friday,Saturday,Sunday 9PM) టెలి కాస్ట్ కానుంది బిగ్ బాస్.

అయితే ఎప్పటి లాగానే ఈ సారి కూడా బిగ్‌బాస్‌ హౌస్ (BigBoss House) లోకి వచ్చే కంటెస్టెంట్లు (Contestants) వీళ్లే అంటూ సోషల్‌ మీడియాలో (Social Media) ఓ లిస్ట్‌ చక్కర్లు కొడుతోంది.

అందులో యాంకర్ రవి, నటి ప్రియా,యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్,ఆర్జే కాజల్, ట్రాన్స్‏జెండర్ ప్రియాంక, యాంకర్ వర్షిణి, కార్తీక దీపం భాగ్య అలియాస్ ఉమ,యానీ మాస్టర్, సిరి హన్మంత్, నటి లహరి, నవ్య స్వామి, యూట్యూబర్ నిఖిల్, వీజే సన్నీ, యాంకర్ లోబో,ఆట సందీప్ భార్య జ్యోతి, శ్వేతల పేర్లు వినిపిస్తున్నాయి.

వీరిలో కొందరి పేర్లు దాదాపు ఫైనలైజ్ (Finalize) అయ్యినట్టు తెలుస్తుంది.

గత సీజన్స్ 3,4 కి కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్ కూడా కింగ్‌ నాగార్జున నే హోస్ట్ గా చేస్తున్నారు.

ఆడియెన్సు మంచి ఎంటర్టైన్మెంట్ (Entertainment) తో అలరిస్తారని భావిస్తూ సీజన్ 5 కంటెస్టెంట్స్ కి ఆల్ ది బెస్ట్…..