బిగ్ బాస్ సీజన్ 5(Big Boss season5) హౌస్ మేట్స్(House mates) కోసం ఇంట్లో ఓ కేక్ ముక్క పెట్టారు. ఇది తినే అర్హత మీలో ఎవరికి ఉందంటూ??? కన్ఫ్యూషన్ లో పడేసాడు బిగ్ బాస్(Big Boss)…..

అయితే నిన్నటి ఎపిసోడ్ లో సన్నీ ఏదైతే అది అయ్యింది నేను తినేస్తా అంటూ అతి ఉత్సాహం చూపించాడు. అయితే ఆనీ మాస్టర్ వద్దంటూ అడ్డుకుంది.

కానీ కేక్ తింటే ఏదో ఒక ఆన్సర్ దొరుకుతుందాని సన్నీ అంటే మాస్టర్ నా కెప్టెన్సీ నేను బిగ్ బాస్ ఆదేశం వచ్చే వరకు ఆగాలని ఆర్డర్ వేసింది.

యాంకర్ రవి ఈ కేక్ తినే అర్హత ఎవరికి వారు  ఉందని అంటున్నారు కాబట్టి , ఆ విషయంపై డిస్కస్ చేద్దాం అని కెప్టెన్ తో అనగా, మీరు మాట్లాడుకోండి కెప్టెన్(Captain) అయ్యాను కాబట్టి నాకే ఆ అర్హత ఉందని ఆనీ ఫీల్ అయింది.

దీంతో సన్నీ మీకు అర్హత ఉంటే తినండి మరి లేదంటే నేను తినేస్తా రిస్క్ తీసుకుంటా అని ముందుకు వచ్చాడు. అయితే సీక్రెట్ రూం(Secret room )లో ఉన్న జస్వంత్ అభిప్రాయాన్ని అడిగారు బిగ్ బాస్(Big Boss). ఆ కేక్ తినడానికి ఎవరు అర్హులని అనుకుంటున్నారు అని అడగ్గా రవికి అర్హత ఉంది.

తొమ్మిది వారాల్లో 8 వారాలు నామినేషన్స్‌ (Nominations)లో ఉన్నాడు అని చెప్పాడు జెస్సీ. ఇక మహాతల్లి ప్రియాంక ఎప్పిటిలానే తాను మానస్‌కి ఆ కేక్ ఇవ్వాలని ఉందని చెప్పడంతో నువ్వు  అన్నీ ఆయనకే ఇచ్చుకో అని సన్నీ అంటే  ఏంట్రా బాబూ ఇలా తయారైంది అని రవి కౌంటర్ వేసాడు.

కేక్‌ తినే అర్హత ఎవరికి ఉందని కంటెస్టెంట్లు(Contestants) డిస్కషన్స్ లో ఉండగా. నాకు ఎవరితోనూ పని లేదు ఏది జరిగితే అది జరుగుతుందని సన్నీకేక్‌ తీసుకుని తినేసాడు.

కేక్ మెల్ట్ అయిపోతుందని  తిన్నానంటూనే ఇప్పుడు ఏం పంచాయితీ అవుతుందోనని ఫీల్ అవుతుంటే యాని మాస్టర్‌ వచ్చి సన్నీ స్ట్రాటజీ(Strategy) ప్లే చేస్తున్నాడని, నువ్వెలా తింటావని తిట్టుకుంటూ ఎప్పుడు రూల్స్(Rules) బ్రేక్ చేస్తాడని ఏడ్చేసింది.

ఆ తరువాత  కెప్టెన్సీ(Captaincy) పోటీదారుల కోసం బీబీ హోటల్‌(BB Hotel) అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో హౌస్‌ కీపింగ్‌ స్టాఫ్‌లో ఉంటూనే గెస్ట్ లకు ఇచ్చే సర్వీసులను చెడగొట్టమని రవికి సీక్రెట్‌ టాస్క్‌(Secret Task) ఇచ్చాడు.

బీబీ హోటల్‌లో శ్రీరామ్‌, షణ్ముఖ్‌ చెఫ్స్‌, వెయిటర్లుగా, యానీ మాస్టర్‌ మేనేజర్‌, రిసెప్షనిస్ట్‌గా, రవి ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న హౌస్‌ కీపింగ్‌, మానస్‌- ప్రియాంక హనీమూన్‌కు వచ్చిన కపుల్స్, కాజల్‌ హోటల్‌ ఓనర్‌(Hotel Owner)కు స్నేహితురాలు, సన్నీ తొలిసారి 5 స్టార్‌(5 Star) హోటల్‌కు వచ్చిన గెస్ట్(Guest), సిరి ఎంతో గారాబంగా పెరిగిన డాన్‌ కూతురుగా నటించాల్సి ఉంటుంది.

ఈ టాస్క్‌లో హోటల్‌ సిబ్బంది అతిథు(Guests)ల నుంచి రూ.15 వేల రూపాయలు గెలిస్తే వారు ఈ టాస్క్ విజేతలు(Winners) గా నిలుస్తారు.

టాస్క్‌(Task) స్టార్ట్ అవ్వగానే  హౌస్ మేట్స్(House mates) తగ్గేదెలే అంటూ ఎవరి పెర్ఫార్మన్స్(Performance) వాళ్ళు ఇచ్చిపడేసారు. సన్నీ, సిరిల పెరఫార్మన్స్ అదిరిపోయింది.

దొరికిందే ఛాన్స్‌ అనుకున్న సిరి షణ్ముఖ్‌ను ఓ ఆట ఆడుకుంది. సిరితో ఈజీ కాదు అని పాట పాడుతూ స్విమ్మింగ్‌ పూల్‌లోని నీటిని స్పూన్‌తో తీస్తూ కాఫీ కప్పు నింపేలా చేసింది సిరి.

దీంతో అతడికి టిప్పిచ్చింది సిరి. సన్నీ తనను టచ్‌ చేస్తుంటే సైలెంట్‌గా ఉన్నావేంటని మానస్‌ మీద చిందులేసింది పింకీ. మరోపక్క రవి,కాజల్‌ బ్యాగులోంచి డబ్బులు కొట్టేసి ఏమీ తేలినట్లు తన పని తాను చేసుకుపోయాడు.

దీంతో కాజల్‌ డబ్బులు పోయాయంటూ మండిపడింది. మరి తరువాత ఎపిసోడ్‌లో గెస్ట్స్(Guests) హోటల్‌ సిబ్బందిని ఇంకెన్ని ముప్పు తిప్పలుపెట్టనున్నారో…..