మన దేశంలో బూడిద గుమ్మడి(Ash Gourd)కి వున్న ఆదరణ ఏ దేశంలో లేదనే చెప్పాలి. గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా పండే బూడిద గుమ్మడిని పూర్వ కాలపు వంటల్లో విరివిగా ఉపయోగించే వారు. ఈ కాలంలో ఏ దిష్టీ తగలకూడదనీ బూడిద గుమ్మడి ఇంటి ద్వారానికి కడతాం. ఈ గుమ్మడిలో ఔషధ గుణాలూ(Medicines) ఎన్నో ఉన్నాయి. బూడిద గుమ్మడి కాయలోనూ విత్తనాల్లోనూ తీగలోనూ కూడా ఔషధ గుణాలున్నాయని వైద్యులు అంటారు.

కడుపులో గ్యాస్ నొప్పి దూరం కావాలంటే బూడిద గుమ్మ‌డి కాయ ర‌సం(Ash Gourd Juice) తాగాలి. క‌డుపులో ఉబ్బ‌రాన్ని త‌గ్గించే గుణాలు ఈ ర‌సంలో ఉన్నాయి. అంతేకాదు బ‌రువు త‌గ్గ‌డానికి దోహ‌దం చేస్తుంది. రోజూ ఓ క‌ప్పు బూడిద గుమ్మ‌డికాయ జ్యూస్‌ను తాగితే క‌లిగే ప్రయోజ‌నాల గురించి తెలుసుకుందాం!

బూడిదగుమ్మడిలో 96% ప్రధానంగా నీటితో నిండి ఉంటుంది. అంతేకాకుండా, విటమిన్ C(Vitamin C) ఇంకా నియాసిన్(niacin),

థయామిన్(Thiamine), రిబోఫ్లావిన్(Riboflavin) వంటి B-కాంప్లెక్స్ విటమిన్లతో సహా వివిధ రకాల ప్రయోజనాలను అందించే విటమిన్స్ ఇంకా మినరల్స్ ను కలిగి ఉంటుంది. ఐరన్, పొటాషియం, జింక్, కాల్షియం మరియు మెగ్నీషియం వంటి మినరల్స్ కూడా బూడిదగుమ్మడిలో విరివిగా లభ్యం అవుతాయి. ఇందులో మంచి మోతాదులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఇంకా పీచు పదార్ధం ఉంటాయి.

బూడిద గుమ్మడిని తరచుగా మన ఆహారంలో తీసుకుంటే.. గ్యాస్‌(Gas), మలబద్ధకం(Constipation) సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. బూడిద గుమ్మడిలో గ్యాస్ట్రోప్రొటెక్టివ్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల మలబద్ధకం, గ్యాస్‌ సమస్యలకు ఔషదంలా పనిచేస్తుంది. దీనిలో ఫైబర్‌(Fiber) పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల కడుపులో మంట, ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

బూడిద గుమ్మడి కిడ్నీలకు మేలు చేస్తుంది.1995లో జియాంగ్సు జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ ప్రచురించిన ఓ అధ్యయనంలో, కిడ్నీలు దెబ్బతిన్న ఎలుకలకు బూడిద గుమ్మడిలోని పదార్థాలను ఇచ్చారు. ఇవి కిడ్నీలను సంరక్షిచండంలో సమర్థవంతంగా పనిచేసినట్లు కొనుగొన్నారు.

ఇరానియన్ జర్నల్ ఆఫ్ ఫార్మకాలజీ అండ్ థెరాపాటిక్స్ 2005లో జరిపిన అధ్యయనం ప్రకారం.. బూడిద గుమ్మడి యాంటీ-డయేరియల్ ఏజెంట్(Anti- Diarrheal Agent) గా పనిచేస్తుంది. దీనితో పాటు మూత్రవిసర్జన మంట, మూత్రం స్తబ్దత, కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు బూడిద గుమ్మడి తీసుకుంటే మంచిది.

ఆయుర్వేదంలో బూడిద గుమ్మడిని ఫ్లూ, జలుబు చికిత్సకు వాడతారు. దగ్గు, జ్వరం, మంటను దూరం చేయడానికి బూడిద గుమ్మడి ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దగ్గు కారణంగా, నోటి నుంచి రక్తస్రావం అవుతూ ఉంటే.. బూడిద గుమ్మడిని తీసుకుంటే మేలు జరుగుతుంది.

బూడిద గుమ్మడి మీ డైట్‌లో చేర్చుకుంటే.. గుండె కండరాలకు బలాన్ని ఇస్తుంది, గుండెలో రక్త ప్రసరణ(Blood Circulation)ను మెరుగుపరుస్తుంది. ఇది గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుంది. హైపర్‌టెన్షన్‌(Hyper Tension)కు బూడిద గుమ్మడి ఔషదంలా పనిచేస్తుంది. కొవ్వులు, కార్బోహైడ్రేట్లు కూడా దీనిలో చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే(Weight Loss) వారికి ఇది మంచి ఆహారం.

మెదడు పనితీరును మెరుగుపరచుకోవాలంటే బూడిద గుమ్మడిని తరచుగా డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది మెదడుకు టానిక్‌లా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బూడిద గుమ్మడి తీసుకుంటే జ్ఞాపకశక్తి(Increase Memory)ని మెరుగుపడుతుంది, నిద్ర ప్రశాంతంగా పుడుతుంది.

బూడిద గుమ్మడిని జ్యూస్‌ లేదా మురబ్బా చేసుకుని తీసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. దాని గుజ్జు నుంచి తాజా రసాన్ని తీసి ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం 20 నుంచి 40 Ml తీసుకుంటే మంచిదని అన్నారు. జలుబు, దగ్గు ఉన్నవారు 2-3 చిటికెల కారం కలుపుకుంటే బాగుంటుందని సూచించారు.