వర్చ్యువల్ రియాలిటీ (virtual reality) ఇప్పుడు సరి కొత్త ట్రెండ్. దాంట్లో లభించే 3D గేములు ఆడడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అందులోని కొత్తదనం మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళగలిగే పరిజ్ఞ్యానం ఇందుకు కారణం. ఇప్పటికే ఈ VR రంగంలో ఎన్నో అంతర్జాతీయ సంస్థలు తమ తమ హెడ్సెట్ లను విడుదల చేసాయి. అది కళ్ళకు పెట్టుకుంటే చాలు మరో ప్రపంచం మన ముందు ప్రత్యక్షం అవుతుంది. అయితే ఇదంతా కంప్యూటర్ ముందు కూర్చుంటేనే సాధ్యమవుతుంది. ఎందుకంటే దీని కేబుల్స్ కంప్యూటర్ కు పెట్టుకుని కంప్యూటర్ ముందు కూర్చుంటేనే కుదురుతుంది. అదే ఇప్పటిదాకా ఈ సాంకేతికత వైర్లెస్ కాలేదన్నమాట. అందుకే వైర్లెస్ VR కొరకు పరిశోధకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

అమెరికా లోని MIT (Massachussetts Institute of Technology) కి చెందిన CSAIL (Computer Science and Artificial Intelligence) లోని పరిశోధకులు MoVR అనే ఒక కొత్త పరిజ్ఞ్యానాన్ని అభివృద్ధి చేసారు. దీని వల్ల VR headset కు కంప్యూటర్ కి అనుబంధంగా ఉండే ఎలాంటి వైర్లు అవసరం లేకుండానే VR సిస్టం లు పని చేస్తాయి. అంటే మనం స్వేచ్చగా VR గేమ్స్ ను ఆనందించవచ్చు. మరి ఈ MoVR అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం.

VR headset లు పని చేయాలంటే హై స్పీడ్ డేటా ట్రాన్స్మిషన్ అవసరం. ఇది సాధారణ వైఫై వల్ల సాధ్యం కాదు. అందువల్లే మనం కంప్యూటర్ను వాడుతున్నాం. దీనికి ప్రత్యామ్న్యాయంగా MIT బృందం millimeter wave wireless technology తో ఒక కొత్త transmitter ను తయారు చేసింది. ఇది సాధారణ transmitter కంటే పెద్దదనే చెప్పాలి. ఈ ట్రాన్స్మిటర్ నుంచి వచ్చే millimeter waves మన వైఫై router నుంచి వచ్చే రేడియో తరంగాల మాదిరిగానే ఉంటాయి కాకపోతే వీటికి రేడియో తరంగాల కంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ. ఈ హై ఫ్రీక్వెన్సీ వల్ల high data transfer రేట్స్ ఈ మిల్లిమీటర్ వేవ్స్ కు ఉన్నాయి. దానితో వైర్లెస్ VR సాధ్యమవుతుంది. ఇక్కడితో అయిపోలేదు. ఈ మిల్లిమీటర్ వేవ్స్ కు ఒక చిన్న పరిమితి ఉంది. రేడియో వేవ్స్ అయితే మనుషులను, గోడలను కూడా దాటి ఎలక్ట్రానిక్ పరికరాల్లోని రిసీవర్ కు చేరతాయి. అందుకే ఇంట్లో వైఫై router ఉంటే ఏ గదిలోనైనా ఇంటర్నెట్ పని చేస్తుంది. అదే మిల్లిమీటర్ వేవ్స్ కు transmitter నుంచి VR headset కు చేరేలోపు ఏమైనా అడ్డు తగిలితే ఇవి ఆగిపోతాయి, అంటే data transfer సాధ్యం కాదు. ఈ పరిమితిని అధిగమించేందుకు MoVR ను ఉపయోగించారు. ఇందులో ఒక 2D యాంటెన్నాtransmitter నుంచి వచ్చే మిల్లిమీటర్ వేవ్స్ కు ఏ అడ్డు లేకుండా వాటిని VR headset కు చేరవేస్తుంది.

పరిశోధకులు ఈ MoVR ను HTC Vive తో పరీక్షించగా అది విజయవంతం అయింది. అందువల్ల పరిశోధకులు ఈ MoVR ఏ VR హెడ్సెట్ కైనా పని చేస్తుందని అంటున్నారు. అయితే ప్రస్తుతం వీరు ఈ MoVR transmitter యొక్క పరిమాణాన్ని తగ్గించి ఒక స్మార్ట్ ఫోన్ అంత సైజుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Courtesy