ఈ కాలంలో అన్నీ చిన్న చిన్నవే ఇప్పుడు సరి కొత్త ట్రెండ్. ఒకప్పుడు పెద్ద పెద్దగా ఉండే టేప్ రికార్డర్స్ నుంచి వాక్మాన్, తరువాత mp3 ప్లేయర్, ల్యాండ్ ఫోన్ల నుంచి మొబైల్ ఫోన్స్, పెద్ద పెద్ద కెమెరాల నుంచి స్మార్ట్ ఫోన్ కెమెరా, డెస్క్టాపుల నుంచి tablet వరకు అన్నీ మనకు అందుబాటులో మన చేతుల్లో పట్టేంత చిన్నవి అయిపోయాయి. కానీ వీటిల్లో ఒక్కటి మాత్రం అలాగే ఉండి పోయింది. అదే, ప్రింటర్. ఈ పని కోసం మనం ఇప్పటికీ బయట షాపుల్లో ఉండే ప్రింటర్ల కోసం పరుగులు పెడుతున్నాం. అందుకే ప్రపంచంలో మొట్ట మొదటి సరిగా ఒక పాకెట్ ప్రింటర్ తయారైంది. రండి అదేంటో చూద్దాం.

జెరూసలేం కు చెందిన Zuta labs అనే సంస్థ ఈ పాకెట్ ప్రింటర్ ను తయారు చేసింది. ఈ పాకెట్ ప్రింటర్ నాలుగు అంగుళాలు వెడల్పు, మూడు అంగుళాల ఎత్తుతో కేవలం 350 గ్రాముల బరువు కలిగి దీనిలో ఒక ప్రింటింగ్ హెడ్ కలిగి ఉంటుంది. దీనిని స్మార్ట్ ఫోన్, tablet మరియు PC కి కనెక్ట్ చేసుకుని కావలసినవి ప్రింట్ చేసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్, విండోస్, iOS ఇలా అన్ని రకాల OS లకు పని చేయడం దీని ప్రత్యేకత. ఈ Zuta కోసం రూపొందించిన ఒక యాప్ ద్వారా ఇది పని చేస్తుంది. దీనిలోని Lithium polymer బాటరీ రీఛార్జి చేసుకునే విధంగా ఉంటుంది. ఇది ఒక మైక్రో USB పోర్ట్ ద్వారా ఛార్జింగ్ చేయబడుతుంది. దీనిని మూడు గంటలు ఛార్జ్ చేస్తే పూర్తిగా ఒక గంట పాటు ప్రింటింగ్ చేసుకోవచ్చని ఈ సంస్థ పేర్కొంటోంది. అంటే ఇంచుమించుగా 60 పేజీలు ప్రింట్ చేసుకోవచ్చు.

ఇక సాధారణ ప్రింటర్ లాగా దీనిలో A4 సైజు పేపర్ ను పెట్టక్కర్లేదు. ఒక టేబుల్ లేదా నేల మీద పేపర్ ను ఉంచి దాని మీద ఈ ప్రింటర్ పెడితే అదే ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే దీనంతట అదే కదులుతూ పేపర్ మీద అక్షరాలు ప్రింట్ చేస్తుంది అన్నమాట. ఈ ప్రింటర్ లోని Omni wheels వల్ల ఇది అటు ఇటూ తిరగడం సాధ్య పడింది. అలాగే దీనిలోని లేసర్ సెన్సర్స్ ఈ పాకెట్ ప్రింటర్ యొక్క వేగాన్ని, దిశను నియంత్రిస్తాయి. సాధారణ ప్రింటర్ లాగే ఇది ఒక పేజీ ప్రింటింగ్ అయిపోతే మరొక పేజీ ఎలా ప్రింటర్లో పెడతామో అలాగే దీనికి కూడా ఎక్కువ పేజీ లు ప్రింటింగ్ ఇస్తే మొదటి పేజీ చివరికి వచ్చాక ఇది ఆగిపోతుంది. వెంటనే దీనిని కొత్త పేపర్ మీద పెట్టి ఈ మొబైల్ యాప్ ను తట్టగానే మళ్ళీ ప్రింటింగ్ మొదలవుతుంది.

దీనిని గత సంవత్సరం అమెరికా లోని Las Vegas లో జరిగిన 2015 CES షో లో ప్రదర్శించారు. ఇక దీని ధర $199 – $250 వరకు ఉంటుంది. ఇది వచ్చే సంవత్సరం నుంచి ఇది అందరికీ అందుబాటులోకి రానుంది.

Courtesy