నోబెల్ బహుమతి. దీని కోసం కలలు కనని శాస్త్రవేత్త ఉండరేమో. ఈ బహుమతిని ప్రపంచ దేశాలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. సదరు విశ్వ విద్యాలయాల ప్రతిభను చాటి చెప్పేందుకు ఇది ఒక కొలమానం అని కూడా చెప్పచ్చు. ఆరు శాస్త్ర విభాగాల్లో ఈ బహుమతిని ప్రకటిస్తారు. అందులో ఒకటి మెడిసిన్. ఈ ఏడాది మెడిసిన్ లో నోబెల్ బహుమతిని తాజాగా ప్రకటించారు. జపాన్ కు చెందిన వైద్య పరిశోధకులు Yoshinori Ohsumi ఈ బహుమతిని సొంతం చేసుకున్నారు. మరి ఈయనకు వైద్యంలో దేని వల్ల ఆ బహుమతి లభించిందో చూద్దాం.

Dr. Yoshinori Ohsumi, జపాన్ లోని Tokyo Institute of Technology లో పరిశోధన చేస్తున్నారు. ఈయనకు వైద్య శాస్త్రంలో Autophagy అనే ప్రక్రియను నిరూపించినందుకు ఈ నోబెల్ బహుమతి వరించింది. మన రక్తంలో ఎన్నో కణాలతో నిండి ఉంటుంది. అవి నిరంతరం ఉత్పన్నమయ్యి, వృద్ధి చెంది నాశనమవుతుంటాయి. దీనినే Autophagy అంటారు. అయితే ఇది అది వరకే తెలుసున్నా దానిని ఇంతవరకూ ప్రత్యక్షంగా ఎవరూ నిరూపించలేదు. Ohsumi సరిగ్గా ఇక్కడ నుంచే తన పరిశోధన ప్రారంభించారు. కణాలు నాశనమయ్యే క్రమoలో Vesicles తయారవుతాయని, అవి కణంలో పునర్నిర్మాణం జరిగే చోటుకు చేరవేయబడతాయని అక్కడి నుంచి అవి నాశనమయ్యేటప్పుడు దాని నుంచే మరో కణం పుడుతుందని ఆయన శాస్త్రీయంగా నిరూపించారు. ఇందుకు ఆయన Baker’s yeast మీద పరిశోధించి సరిగ్గా ఇలాంటి పద్ధతే మానవ శరీరంలో కూడా చోటు చేసుకుంటుందని ఆయన నిరూపించగలిగారు.

అయితే దీని వల్ల ప్రయోజనం ఏంటి అంటే, మనలోని జన్యు మార్పులు ఈ Autophagy కి కారణం అవుతుందని దాని వల్ల పార్కిన్సన్, టైపు 2 డయాబెటిస్ మరియు కాన్సర్ వంటి రోగాలకు కారణం అవుతోందని కనుగొన్నారు.
ఏది ఏమైనా ఎన్నో సంవత్సరాల పాటు ఈయన చేసిన కృషికి ఈ బహుమతి లభించిందని, ఈయన అన్నారు. మానవాళికి మేలు చేసే ఇటువంటి పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా జరగాలి, అందరికీ నోబెల్ రాకపోయినా వారిని గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.

Courtesy