బైక్ మీద ఎన్నో ప్రదేశాలు తిరగడం అంటే యువతకు చాలా ఇష్టం ఉంటుంది. అసలు బైక్ రైడ్ అంటే పట్టణాల్లో కాదు, పట్టణాలకు ఆవల, ఒక్కో నగరాన్ని కలిపే హై వే లాంటి ప్రదేశాల్లో బైక్ రైడ్ లు చాలా బావుంటాయి కదూ. ఏ దేశమైతేనే ఇలా బైక్ పై వెళ్తుంటే ఆ భూమి యొక్క సహజ సౌందర్యానికి మైమరచిపోనీ వారు ఉండరు. అందుకే ఎంత కార్లు ఉన్నా వారాంతాల్లో ఇలా బైక్ రైడ్ లకు వెళ్ళే వారు మన దేశంలో ఉంటే, అంతకు మించిన సంఖ్యలో విదేశాల్లో ఉన్నారు. ఇలాంటి రైడ్ లకు హెల్మెట్ తప్పనిసరి. కానీ అదే హెల్మెట్ లో కాస్త మార్పులు చేసి మరింత సౌకర్యంగా అందిస్తోంది కొరియన్ సంస్థ eCell.

eCell అనే సంస్థ Ply 2.0 అనే హెల్మెట్ ను తయారు చేసింది. దీనిలో సాధారణ helmet మాదిరి తల నుంచి గడ్డం వరకు మూసి ఉండటంతో రక్షణ లభిస్తుంది. ఆ పైన ఈ హెల్మెట్ పై భాగంలో అమర్చిన HD కెమెరా ద్వారా 120 డిగ్రీల కోణంలో వీడియో తీస్తుంది. ఈ సౌకర్యం కలిగిన ప్రపంచపు మొట్ట మొదటి హెల్మెట్ ఇదే. అంతే కాదు ఫలానా ప్రాంతంలోని ట్రాఫిక్ అప్డేట్ ఈ హెల్మెట్ పంపిన వీడియో ఫీడ్ ద్వారా లైవ్ లో చూడవచ్చు. దీనిలోని బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా మీ ఫోన్ కు అనుసంధానం చేయబడుతుంది. అందువల్ల హాండ్స్ ఫ్రీ కాలింగ్ సాధ్య పడుతుంది. అంతే కాదు దీనిలో Wi-Fi, GPS సౌకర్యం కూడా ఉంది. రైడ్ రూట్ పెట్టుకుంటే మీకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చూడాల్సిన అవసరం లేకుండా దిశా నిర్దేశం చేస్తుంది. అంతే కాదు ఈ హెల్మెట్ లోని wi-fi ద్వారా లాప్టాప్ అవసరం లేకుండా వీడియోలను సైట్ లో షేర్ చేయవచ్చు, ప్లే చేయవచ్చు. ఇలా రికార్డు అయిన రైడ్ ను ఒక ప్రత్యేకమైన సైట్ లో సేవ్ చేసి షేర్ చేసే సౌకర్యం కూడా ఉంది. అంతే కాక దీనిలోని noise cancelling మైక్రోఫోన్ వల్ల ఫోన్లో అవతలి వారు చెప్పేది ఎలాంటి అంతరాయం లేకుండా వినిపిస్తుంది.

సాధారణ హెల్మెట్ కంటే ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టే ఇప్పటికే ఈ హెల్మెట్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ హెల్మెట్ ను ఈ కొరియన్ eCell సంస్థ నవంబర్ లో మిలాన్, ఇటలీ లో జరిగిన EICMA ఎక్సిబిషన్ లో ప్రదర్శించింది.

ఇక ఈ హెల్మెట్ ధర $399. బహుశా బైక్లను లక్షల్లో కొనే యువత ఈ హెల్మెట్ కు నిర్దేశించిన ధరను కూడా లెక్క చేయరని వీరి ఉద్దేశ్యమేమో.

Courtesy