నీరు ఆవశ్యకత ఏంటో మనందరికీ తెలుసు. సురక్షితమైన మంచి నీరే మనిషికి రక్ష. అయితే ఇలాంటి మంచి నీటిని పైప్ లైన్ల ద్వారా కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి మన ఇంటికి వస్తుంది. ఇళ్ళు ఎలా ఉన్నా నీటి సరఫారా ఉందా లేదా అని చూడడం తప్పనిసరి. అందువల్ల అలాంటి నీరు ఎలా శుద్ధి చేయబడి మన దగ్గరకు వస్తుందా అని నమ్మకం లేదు. అందుకే కదా మనం వాటర్ ఫిల్టర్లు పెట్టుకున్నాం అని అనుకోవచ్చు. కానీ అసలు నీరు ఎలా ఉందో దాని శుద్ధత ఏమిటో తెలుసుకుంటే, ఆ పైన మనం పెట్టుకున్న ఫిల్టర్లు ఆ నీటిని ఏ మేరకు శుద్ధి చేస్తాయో తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద పరిశ్రమలు తమ పరిశ్రమల నుండి వచ్చే అవశేషాలను భూమిలో, నీటిలో కలిపేస్తున్నప్పుడు అందులో ఉండే వ్యర్ధ పదార్ధాలతో కలిసి పోయిన నీటిని ఏ మేరకు ఈ ఫిల్టర్లు శుద్ధి చేస్తాయో ఒక అంచనా వేసేయవచ్చు.

పెద్ద పెద్ద లాబరేటరీలలో మాత్రమే (పొల్యూషన్ బోర్డు) చేయగలిగే నీటి పరీక్షలను చేసి వాటి ఫలితాలను అప్పటికప్పుడు మనకు అందిస్తుంది WaterBot. ఇది ప్రపంచపు మొట్ట మొదటి real time water quality monitor. దీనిని అమెరికాలోని waterdoctors అనే సంస్థ రూపొందించింది. ఇది నీటి ఉష్ణోగ్రతను, నీటిలోని TDS (Total Dissolved Solids) ను గమనిస్తుంటుంది. దీనిని IBM, Analog Devices, మరియు TE Connectivity అనే సంస్థల software పరిజ్ఞ్యానం తో రూపొందించారు. ఈ పరికరాన్ని మీ ఇంటికి వచ్చే నీటి పైప్లైన్ కు అనుసంధానం చేస్తే నీటి సమాచారం లైవ్ లో మీ ఫోన్ లేదా tablet కు వచ్చేస్తుంది. అంతే కాదు దీని యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే, దీనిని అమెరికాలోని నీటి పారుదల వ్యవస్థ అయిన OpenWaterQuality.org కు సైతం మీరు మీ ఇంటికి వచ్చే data ను పంపించవచ్చు. అలా చేయడం వల్ల వారి డేటాబేస్ లో ఫలానా ప్రాంతం నుంచి వచ్చే నీటి శుద్ధత యొక్క సమాచారం ఎప్పటికప్పుడు చేరిపోతుంది. ఏదైనా పైప్లైన్ లీకేజ్ లేదా మరేదైనా కారణం వల్ల మంచి నీరు రాకపోతే, మీరు వెంటనే సదరు నీటి సరఫరా వ్యవస్థకు ఫిర్యాదు చేయవచ్చు. తద్వారా ఆ ప్రాంతానికి వచ్చే పైప్లైన్ ను సవరించడం అధికారులకు సులభం అవుతుoది. లేదంటే కొన్ని నెలల పాటు ఆ లీకేజ్ లేదా పైప్ లైన్ సమస్య ఎవరికీ తెలియకుండా అలాగే ఉండిపోతుంది అంటున్నారు సంస్థ వ్యవస్థాపకులు Bob Richter.

మనం తాగే మంచి నీరు గురించి ఎప్పటికప్పుడు real time data వస్తే అంతకు మించి కావల్సింది ఏముంది ఈ విధంగా నీటి ద్వారా వ్యాపించే రోగాలకు అడ్డు కట్ట వేయచ్చు కదూ. ఇక ఈ పరికరంలో రెండు రకాలు ఉన్నాయి. అవి WaterBot Node, Node+. అసలు ఇంట్లో ఎలాంటి ఫిల్టర్ లేకపోతే Node, ఏదైనా వాటర్ ఫిల్టర్ సిస్టం ఇప్పటికే ఉన్నట్టయితే Node+ ఉపయోగించాలి. దీని ధర $139 నుండి $200 వరకు ఉంది. ఇది ఇప్పటికే మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది.