VibWrite: చేతి వేళ్ళ ఆధారంగా పటిష్టమైన భద్రతా వ్యవస్థ

భద్రత. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రస్తుత కాలంలో ఇది పెద్ద సవాలు అయిపోయింది. ఎందుకంటే మన ఫోన్ల దగ్గర నుంచి ఇళ్ళు, లాకర్ల వరకు అన్నిటినీ భద్రంగా ఒకప్పుడు తాళం వేసేవారు. కానీ ఇప్పుడు ఆ తాళం స్థానంలో స్మార్ట్ లాక్స్ (smart lock) వచ్చేసాయి. ఫోన్ లాక్ చేయడానికి మనం ఎదో ఒక పిన్ నెంబర్ లేదా pattern వాడటం మనం చూస్తూనే ఉన్నాం. కానీ వీటన్నిటినీ కూడా తేలిగ్గా తెలుసుకునే హాకర్లు ఎక్కువై పోయారు. అలా వ్యక్తిగత ఫోన్ల దగ్గరనుంచి సెలబ్రిటీ సోషల్ మీడియా ఎకౌంటులు, బ్యాంకు ఎకౌంటులు, పెద్ద పెద్ద సంస్థల సర్వర్ల వరకు హాకింగ్ కు గురవుతున్నాయి.

పెద్ద పెద్ద సంస్థలను పక్కన పెడితే ఈ రోజుల్లో ఇంటికి ఉపయోగించే smart locks భద్రతా వ్యవస్థ కూడా కొంచెం లోపాలతో కూడుకున్నదే. ఎందుకంటే వీటిని ఉపయోగించాలంటే పెద్ద పెద్ద టచ్ స్క్రీన్ సిస్టంలను బయట అమర్చి, దానికి ఫలానా పాస్వర్డ్ లేదా పాస్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటిలో ప్రధాన లోపం ఏంటంటే, ఇవి మనుషులను గుర్తించకుండా ఆయా పాస్వర్డ్ లేదా పాస్ కోడ్ లను గుర్తించడం. అంటే పొరపాటున మన పాస్వర్డ్ లేదా పాస్ కోడ్ ఎవరికైనా తెలిసిందంటే అంతే సంగతులు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏ భద్రతా వ్యవస్థ అయినా ఫింగర్ ప్రింట్, కెమెరా, కార్డు ఆధారంగా పని చేస్తుంది. ఇక రెటీనా స్క్రీన్ (security systems) వంటివి ఉన్నాయి కానీ వాటిని ఉపయోగించాలంటే చాలా పెద్ద పరికరాలు అవసరం అవుతుంది. అలాగే దానిని మైంటైన్ చేయడం కూడా ఖర్చుతో కూడుకున్న పని. ఇలా కాకుండా ఇళ్ళ దగ్గర నుంచి పెద్ద బ్యాంకులు, సంస్థల వరకు అందరూ ఉపయోగించడానికి పటిష్టమైన భద్రతా వ్యవస్థను రూపొందించారు Rutgers University కి చెందిన Yingying (Jennifer) Chen. అదే ఈ VibWrite. అదేంటో చూద్దామా..

ఈ VibWrite లో మన చేతి వేళ్ళ ఆధారంగా భద్రతను ఏర్పాటు చేయడం అన్న మాట. ఈ VibWrite సెక్యూరిటీ సిస్టం లో కూడా access కోసం పిన్, pattern లను ఉపయోగిస్తుంది కానీ తేడా ఏంటంటే, ఈ పిన్ వత్తేటప్పుడు వేలి ఒత్తిడి వల్ల వచ్చే తరంగాలను ఈ VibWrite సాఫ్ట్వేర్ గుర్తిస్తుందన్న మాట. ప్రతీ వ్యక్తి వేలి నిర్మాణం మరో వ్యక్తి కంటే భిన్నంగా ఉంటుంది. అలాగే ఆ చేతి వేళ్ళ వత్తిడి కూడా మరో వ్యక్తి కంటే భిన్నంగా ఉంటుంది. ఈ సూత్రం ఆధారంగా ఈ భద్రతా వ్యవస్థను రూపొందించారు Chen. ఇక ఈ సెక్యూరిటీ సిస్టం టచ్ పానెల్ లో కేవలం ఒక Vibration motor మరియు Vibration receiver ఉంటాయి. ఈ పానెల్ మీద మనం పిన్ లేదా pattern వత్తితే తద్వారా వచ్చే తరంగాలను ఈ receiver గ్రహించి అది వ్యక్తులను authenticate చేస్తుందన్న మాట. ఈ VibWrite కు మరో ప్రత్యేకత ఏంటంటే, ఈ పిన్ లేదా పాస్వర్డ్ కోసం ప్రత్యేకించి టచ్ పానెల్ అవసరం లేదు. గోడ మీద, తలుపు మీద ఇలా ఏ ఘనపదార్ధం పైననైనా సరే ఇది పిన్ ను గ్రహిస్తుంది. దీని వల్ల ఈ VibWrite అత్యంత చౌకగా మనకు లభిస్తుంది. దీనిని ఇళ్ళు, లాకర్లు, కార్లు మొదలైన వాటి భద్రత కోసం ఉపయోగించవచ్చు.

ఈ VibWrite సెక్యూరిటీ సిస్టం కు మరే ఇతర పరికరాలు అవసరం లేకపోవడం వల్ల దీనిని అందరూ ఉపయోగించే వీలు ఉంటుంది. అంతే కాదు దీనిని మరెవ్వరూ ఏ విధంగాను దీనిని హాక్ చేయలేకపోవడం దీని ప్రత్యేకత. ఈ VibWrite ను ఉపయోగించి చేసిన ట్రయల్స్ లో ఇది 95 శాతం వ్యక్తులను authenticate చేసింది. అయితే ఇది చాలదు, దీనిని మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్ది దీనిని త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నారు అని చెప్పారు Chen.

ఈ పరిశోధనను ఈ రోజు ACM (Association for Computing Machinery) Conference on Computer and Communications Security లో ప్రచురించారు.

Courtesy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *