మానవ పరిణామ క్రమంలో మనం ఎన్నో నేర్చుకున్నాం. ఎన్నో నాగరికతలు, ఎంతో శాస్త్రాధ్యయనం, ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు, విప్లవాత్మకమైన నిజాలు, మనకు నడవడిని నేర్పే మత గ్రంధాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఎన్నో కొత్త కొత్త వస్తువులు కనిపెట్టారు. ఉదా: wheel అలాగే ప్రింటింగ్ ప్రెస్ కూడా ఒక విప్లవాత్మకమైన ఆవిష్కరణే. అటు తర్వాత నుంచీ మనం సంపాందించిన జ్ఞ్యానమంతా పుస్తకాలలో ముద్రించి గ్రంధాలయాలలో ఉంచి ప్రభుత్వాలు తరువాతి తరాలకు అందించడం జరిగింది. ఇక అక్కడి నుంచీ ఈ కాలానికి వస్తే మనకు కంప్యూటర్లు, TB storage device లు ఇలా ఎన్నో వచ్చేసాయి. అయితే అవన్నీ వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరుచుకోవడానికి పనికొస్తాయి. అదే ఈ ప్రపంచపు జ్ఞ్యానాన్ని మొత్తం పొందుపరచాలంటే, అది కూడా ఒకటి రెండు దశాబ్దాలు, శతాబ్దాలు కాదు ఏకంగా సృష్టి అంతం వరకూ పొందు పరచగలిగితే? అసాధ్యం అనుకుంటున్నారా. సుసాధ్యం చేసారు UK లోని శాస్త్రవేత్తలు.

5d quartz Featured

University of Southampton కు చెందిన శాస్త్రవేత్తలు digital data storage లో పెను విప్లవానికి నాంది పలికారు. మన అరచేతి కంటే తక్కువ పరిమాణం లో ఉండే ఒక చిన్న గాజు పరికరం (5D Storage) లో 360 TB సమాచారాన్ని ఎప్పటికీ చెరిగిపోని విధంగా పొందుపరిచి ఉంచడం ఒక అసాధారణ విషయం. అది కూడా 13.8 బిలియన్ సంవత్సరాల వరకు అంటే ఇంచి మించుగా సృష్టి అంతం వరకూ అంటే నమ్మగలరా. కానీ ఇది నిజం. అదెలాగో చూద్దాం.

5d quartz memory 2

quartz తో తయారైన ఈ గాజు పరికరంలో femtosecond laser writing అనే పద్ధతి ద్వారా సమాచారాన్ని సేకరించి భద్రపరచవచ్చు. ultra fast laser కిరణాల ద్వారా light pulses ను nano structured గ్లాస్ మీద పొరలు పొరలుగా సమాచారాన్ని చిన్న చిన్న డాట్స్ (dots) గా భద్రపరచడం అన్న మాట. ఇంకా తేలిగ్గా చెప్పాలంటే మొత్తo విషయాన్ని మనం ఎలా అయితే ఒక పుస్తకంలో అన్ని పేజీల్లో అన్ని వాక్యాల్లో రాస్తామో అదంతా కలిసి కేవలం ఒకే ఒక్క అతి చిన్న డాట్ లాగ భద్రపరచడం అన్న మాట. ఇందులోని సమాచారాన్ని optical microscope మరియు polariser సహాయంతో చదవవచ్చు.
ఈ పరికరం మన చరిత్రను అలాగే science విశేషాలు, ప్రాచీన విద్యలు మరియు మత గ్రంధాలను ఎప్పటికీ కోల్పోని విధంగా భద్రపరచడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఇందులోకి Universal Declaration of Human Rights (UDHR), Newton’s Opticks, The Magna Carta మరియు The King James Bible వంటివి భద్రపరిచారు.

మానవ మేధస్సు ద్వారా మనం సంపాదించిన జ్ఞ్యానాన్ని భవిష్యత్తు తరాలకు భద్రంగా అందించడం కొరకు చేసిన ఈ ప్రయత్నం అసాధారణo, అసామాన్యం. అందుకేనేమో ఇటువంటివి చూస్తే మానవులకు అసాధ్యం కానిదంటూ ఏదీ లేదు అని అనిపించక మానదు.

Courtesy