కాలం ఎంత మారినా, ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా కొన్ని మౌలిక వసతులు ఇప్పటికీ ప్రశ్నార్ధకంగానే మిగిలిపొయాయి. ఎన్నో అభివృద్ధి చెందని దేశాల్లో ఇప్పటికీ విద్యుత్తూ, ఆరోగ్యం ఇంకా చెప్పాలంటే కనీసం తాగు నీరు కూడా దొరికే పరిస్థితి అక్కడి భూగోళ పరిస్థితుల వల్ల లేదు. అందువల్ల కొంత మంది పరిశోధకులు అక్కడి సమస్యను తీర్చడం వైపే దృష్టి సారిస్తున్నారు.

అటువంటి వారిలో ప్రొ. ఒమర్ యాఘీ ఒకరు. University of California కు చెందిన ఈ కెమిస్ట్ ఎడారి వంటి ప్రదేశాల్లో జీవిస్తున్న వారికి తాగు నీరును అందించేoదుకు ఒక పరికరాన్ని కనిపెట్టారు. దీంట్లో సూర్య రశ్మి ని ఉపయోగించి వాతావరణ తేమ నుండి నీటిని పిండుకోవచ్చు. దీనికి Solar Harvester అని పేరు పెట్టారు. అలా మనుషులకు తాగడానికి మంచి నీరు లభిస్తుంది. అంతే కాదు ఈ పరికరం గాలిలో తేమ అత్యంత తక్కువ శాతం (<20%) ఉన్న ప్రాంతాల్లో కూడా సమర్దవంతంగా పని చేస్తుంది.

ఈ పరికరంలో ప్రధానంగా ఈ భాగాలు ఉంటాయి. అవి solar absorber, MOF plate, condenser మరియు water collector. ఈ పరికరo లో అత్యంత కీలకమైన వస్తువు MOF’s (Metal Organic Frameworks). కొన్ని రకాల MOF లు సహజ వాయువు వంటి వాటిని సేకరిస్తే, మరి కొన్ని కార్బన్ డై ఆక్సైడ్ వంటి వాటిని సేకరించగలవు. ఈ solar harvester పరికరంలో నీటిని పిండటం కోసం, zirconium మరియు adipic acid లను ఉపయోగించారు. ఈ MOF లను ఒక ప్రత్యేకమైన క్రిస్టల్ ప్లేట్ మీద తాపడం చేసి ఈ solar harvester పరికరంలోని మధ్య భాగంలో అమర్చుతారు. ఇక ఈ solar harvester అనే పరికరం ఎలా పని చేస్తుంది అంటే, ఈ పరికరాన్ని రాత్రి పూట పైన మూత తీసి బయట ఉంచితే, గాలికి ఈ MOF ప్లేట్ మీద ఉన్న ఆర్గానిక్ molecules తేమను (water vapor) ను పీల్చుకుంటాయి. అప్పుడు ఉదయం ఎండకి పైన తిరిగి మూత పెట్టి ఉంచాలి. పైన ఉన్న solar absorber ప్లేట్ (అంటే సూర్య కాంతి వేడిమిని ఎక్కువగా గ్రహించగల ప్లేట్ ఏదైనా సరే) వేడిమికి కింద ఉన్న MOF ప్లేట్ లో తేమ కరిగి condenser లో పడుతుంది. అలా అక్కడ ఒక్కో చుక్క ఘనీభవించి నీరై కింద అడుగు భాగంలో నీరుగా మనకు అందుతుంది.

ఈ పరికరం ద్వారా గంటకు 400 ml అంటే ఇంచు మించు అర లీటర్ నీరు ఎలాంటి విద్యుత్ మరే వస్తువు అవసరం లేకుండా మనకు అందుతుంది. ఈ Solar harvester ఎడారి ప్రాంతాల్లో నివసించే, పరిశోధన చేసే వారి మీద ప్రయోగించగా వారు దీనిని ఉపయోగించి అక్కడ నీరు లేకపోయినా ఈ పరికరం అందించిన నీటితో బ్రతికారని తేలింది.

ఈ పరిశోధన జర్నల్ Science లో ప్రచురింపబడింది.