కొవ్వును కరిగించే స్కిన్ పాచ్

నడుము కొలత ఆరోగ్యాన్ని సూచిస్తుంది. వయసును బట్టి, ఈ చుట్టు కొలత పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు మనలో చేరినట్టే లెక్క. అయితే ఇది ఊబకాయం కిందకి రాదు. సన్నగా ఉన్నవారికి కూడా శారీర మధ్య భాగం అదే ఉదరం దగ్గర కొవ్వు పేరుకుని ఉంటోంది. ఇది వారి అందం, ఆత్మ విశ్వాసం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇక ఇలాంటి సమస్యలు ఉంటే కొన్ని రకాల బ్యూటీ ట్రీట్మెంట్లు, లైపొసక్షన్లు అందుబాటులో ఉన్నా అవి ఏ మేరకు ఫలితాన్ని ఇస్తున్నాయో మనకు తెలియంది కాదు. అయితే నడుము దగ్గర పేరుకున్న కొవ్వు కరగాలంటే వ్యాయామం తప్పనిసరి. కానీ ప్రస్తుత జీవన శైలిలో దానికి నూరు శాతం ఎవరూ సమయం కేటాయించలేకపోతున్నారు. ఈ ఇబ్బందిని గ్రహించి సింగపూర్ కు చెందిన పరిశోధకులు ఒక స్కిన్ పాచ్ ను తయారు చేసారు. దీనితో నడుము వద్ద పేరుకున్న కొవ్వును పూర్తిగా కరిగించేస్తుందట. మరి అది ఎలాగో ఏంటో చూద్దామా.

ఇది అర్ధం కావాలంటే ముందు కొవ్వు గురించి తెలుసుకోవాలి. మన శరీరంలో కొవ్వు రెండు రకాలు బ్రౌన్ ఫాట్ (Brown fat), వైట్ ఫాట్ (White fat). ఈ బ్రౌన్ ఫాట్ నుండి శరీరం శక్తిని తీసుకుంటుంది, అంటే మనం చేసే పనులకు శక్తి వచ్చేది ఈ బ్రౌన్ ఫాట్ నుండే. అదే వైట్ ఫాట్ అసలు కరగదు. ఎళ్ళకేళ్ళు అలా అవయవాల మధ్య అలా పేరుకుని ఉండిపోతుంది. Nanyang Technological University, Singapore (NTU) కు చెందిన ప్రొ. Chen Peng ఒక స్కిన్ పాచ్ ను తయారు చేసారు. దీనిలో కొన్ని వందల micro needles ఉంటాయి. వీటిలో Beta-3 adrenergic receptor agonist లేదా thyroid hormone T3 triiodothyronine అనే డ్రగ్ ఉంటుంది. ఈ స్కిన్ పాచ్ ను ఒంటికి అంటించి రెండు నిముషాలు వత్తితే చాలు దీనిలో ఉన్న micro needles శరీరంలోకి చొచ్చుకుని పోయి ఈ వైట్ ఫాట్ ను బ్రౌన్ ఫాట్ గా మార్చే పనిలో ఉంటాయి.

Prof Chen Peng with Asst Prof Xu Chenjie

Prof Chen Peng with Asst Prof Xu Chenjie

అసలు నిజానికి ఈ స్కిన్ పాచ్ లో వాడిన డ్రగ్ ఊబకాయాన్ని నియంత్రించడానికి ఉపయోగిస్తారు. అదే డ్రగ్ ను ఇలా micro needles ద్వారా పంపించడంతో డ్రగ్ నెమ్మది నెమ్మదిగా శరీరంలోకి ప్రవేశిoచడం వల్ల సమర్ధవంతంగా పని చేస్తుంది. ఆ విధంగా ఇది ఒక మాత్ర ద్వారా తీసుకునే డ్రగ్ పరిమాణం కంటే తక్కువ డ్రగ్ ఉండటం వల్ల దీని తయారీ ఖర్చు కూడా చాలా తక్కువ. అంతే కాదు సరిగ్గా ఫలానా అవయవం మీద పాచ్ వేయడం, తక్కువ మోతాదులో డ్రగ్ ఉండడం వల్ల దుష్పరిణామాలు కూడా ఉండవు.

Skin patch with micro needles

Skin patch with micro needles

ఈ స్కిన్ పాచ్ ను నాలుగు వారాల పాటు ఎలుకల మీద ప్రయోగించారు. ఎలుకలకు high fat ఆహారం తినిపిస్తూనే ఈ స్కిన్ పాచ్ ను పరీక్షించగా అవి బరువు పెరగలేదు ఆ పైన వాటి overall fat mass కూడా 30 శాతం మేర తగ్గింది. ఈ ఫలితాలతో ఈ పాచ్ యొక్క సామర్ధ్యం ఏంటో రుజువైంది అన్నారు Chen. ఇక ఈ స్కిన్ పాచ్ ను కేవలం $5 కే తయారు చేయవచ్చు అంటున్నారు Chen. ఈ స్కిన్ పాచ్ లో ఉపయోగించిన రెండు రకాల డ్రగ్స్ ను కొన్నేళ్ళుగా ఊబకాయం నియంత్రణకు వాడుతున్నారు. అంతే కాదు ఈ డ్రగ్ కు అమెరికా లో FDA అనుమతి కూడా ఉంది.

ఈ పరిశోధన Small Methods అనే జర్నల్ లో ప్రచురించబడింది. అప్పటి నుండి ఈ పరిశోధక బృందానికి ఫార్మా, బయోటెక్నాలజీ సంస్థల నుండి ఈ స్కిన్ పాచ్ తయారు చేయడానికి సంప్రదింపులు జరుపుతున్నారు.

అవును మరి నోరు కట్టేసుకోకుండా ఇలాంటి సులువైన మార్గాలతో బరువు తగ్గచ్చు అంటే ఎవరు కాదంటారు.

Courtesy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *