సర్వేంద్రియానం నయనం ప్రధానం అని కదూ నానుడి. మన శరీరంలోని అన్ని ఇంద్రియాలలో కంటి ద్వారా మనం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. కంటితోనే మనకు ఈ ప్రపంచానికి సంబంధం ఏర్పడింది. అలాంటి కంటి చూపు లేకపోవడం, కొన్ని కారణాల వల్ల కంటి చూపు కోల్పోవడం దురదృష్టకరమే. అయితే పుట్టుకతో చూపు లేని వారి కంటే మధ్యలో కొన్ని రకాల వ్యాధుల వల్ల చూపు కోల్పోయిన వారికి వైద్య చికిత్స ద్వారా కొద్దో గొప్పో చూపు తిరిగి లభించవచ్చు. ఈ రోజు మనం అలాంటి ఒక వ్యాధి వల్ల చూపు కోల్పోయిన వారికి, అభివృద్ధి చెందిన సాంకేతిక విజ్ఞ్యానం తిరిగి చూపును ఎలా ప్రసాదిoచిందో చూద్దాం.

Bionic Eye

Retinitis Pigmentosa అనే కంటి వ్యాధి మూలంగా కొంత మంది సమూలంగా కంటి చూపును కోల్పోతారు. ఇది సుమారుగా మనుషులకు 30 లలో సోకి వచ్చే పదేళ్ళలో వారిని పూర్తిగా అందులుగా మార్చేస్తుంది. దీనికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్యం ఎంతో ఖరీదుతో కూడుకున్నది. ఇది ఎందుకు వస్తుందో కూడా ఇంత వరకూ కారణాలు తెలియలేదు. ఈ వ్యాధి సోకినా వారు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మందికి పైనే ఉన్నారు.

ఇటువంటి వారికి శుభవార్త, అభివృద్ధి చెందిన సాంకేతిక విజ్ఞ్యానం – bionic eye implantation ద్వారా తిరిగి వీరికి చూపు లభిస్తుందని అంటున్నారు ఆస్ట్రేలియా కు చెందిన వైద్యులు మరియు శాస్త్రవేత్తలు. “Phoenix99” అనే bionic eye ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఇంతకీ ఈ bionic eye అంటే ఏంటి అనుకుంటున్నారా. ఒక ఎలక్ట్రానిక్ పరికరం, మానవ శరీరంలో భాగంగా అమర్చబడి, ఆయా శరీర అవయవానికి ప్రత్యామ్న్యాయంగా పని చేయడం.

ఇక ఈ Phoenix99 bionic implantable eye ను ఆస్ట్రేలియా లోని University of New South Wales కు చెందిన శాస్త్రజ్ఞ్యులు తయారు చేసారు. దీని నమూనాను ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ముగ్గురికి అమర్చగా వారి ప్రయత్నం విజయవంతం అయింది. అలాగే దీని తరువాతి నమూనాను పేషెంట్లకు అమర్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సర్జరీ 2-3 గంటలు పడుతుంది. ఆ పైన చెవి వెనుక కేవలం ఒక చిన్న డిస్క్ ను అమర్చుతారు. ఈ డిస్క్ కంటికి పవర్ ను, data ను చేరవేస్తుంది. ఇక ఈ సమాచారం ఎలక్ట్రికల్ impulse ద్వారా కంటి వెనుక భాగానికి చేరుతుంది. ఇక వీరు పెట్టుకునే కళ్ళజోడులోని కెమెరా ఎదుట దృశ్యాలను photo తీయడం ద్వారా కంటిలోని రెటినాలోని నరాలు stimulate చేయబడి, ఈ సంకేతాలు మెదడుకు చేరతాయి. ఆ విధంగా వీరు ఎదుట ఉన్న దృశ్యాన్ని గ్రహించగలుగుతారు.

Bionic Eye

ఈ పద్ధతి ద్వారా ఈ జబ్బు ఉన్న వారే కాదు, ఇంకా కొన్ని కోట్ల మందికి కంటి చూపును తిరిగి తెప్పించవచ్చు అంటున్నారు ఈ univeristy కి చెందిన శాస్త్రవేత్తలు. ఈ Phoenix99 bionic eye ను మరింత అభివృద్ధి చేసేందుకు నిధులు సేకరిస్తున్నారు దీని రూపకర్తలు.

ఇదొక్కటే కాదు, ఇలాంటి కొన్ని రకాల bionic eye ల తో కొంత మందికి ఇప్పటికే తిరిగి కంటి చూపు లభిస్తోంది కూడా. ఈ Phoenix99 విజయవంతం అయితే భవిష్యత్తులో చూపు లేకపోవడం శాపం కాదు కదూ.

Courtesy